Share News

Justice Nagesh: రూ.కోటి ఫైన్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

ABN , Publish Date - Mar 18 , 2025 | 01:38 PM

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ సంచలన తీర్పు వెల్లడించారు. హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు రూ.కోటి జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చారు.

 Justice Nagesh: రూ.కోటి ఫైన్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Telangana High Court

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు(High Court) న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక (Justice Nagesh Bhimapaka) సంచలన తీర్పు వెల్లడించారు. హైకోర్టును తప్పుదోవ పట్టించిన పిటిషనర్‌కు రూ.కోటి జరిమానా (One Crore fine) విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టు వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే ఆ విషయాన్ని దాచిన పిటిషనర్ మరో బెంచ్ వద్ద కొత్త పిటిషన్ వేసి ఆర్డర్ తీసుకున్నాడు.


ఈ విషయం ధర్మాసనం దృష్టికి రావడంతో జస్టిస్ నగేశ్ ఆగ్రహించారు. ఉన్నత న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టించడంపై మండిపడ్డారు. ఓ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా మరో బెంచ్‌ వద్ద రిట్ పిటిషన్ ఎలా వేస్తారంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు పిటిషనర్‌కు రూ.కోటి జరిమానా విధించారు. కాగా, ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడే వారికి ఈ తీర్పు ఓ చెంపపెట్టు లాంటిదని పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు జస్టిస్ నగేశ్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతిలో బిట్స్ ఏర్పాటుకు నిర్ణయం: మంత్రి లోకేష్

ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంత్రి ప్రెజెంటేషన్

Updated Date - Mar 18 , 2025 | 01:58 PM