Share News

Chief Justice: తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్

ABN , Publish Date - Jul 14 , 2025 | 06:55 PM

తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.

Chief Justice: తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్
Justice Aparesh Kumar Singh

హైదరాబాద్, జులై 14: తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కాగా, ఇంతకు ముందు త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ పనిచేశారు. ఇక ప్రస్తుత తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా ఉన్న సుజయ్ పాల్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలిజియం సిఫార్సు చేసింది.

ఇదిలా ఉండగా, అపరేష్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) 1965, జూలై 7న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. అనంతరం 1990 నుంచి 2000 వరకూ ఉత్తర్ ప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత 2001లో జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.


2021 ఏప్రిల్ నుంచి జార్ఖండ్ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా అపరేష్ కుమార్ నియమితులయ్యారు. ఇక 2022 నుంచి 2023 వరకూ జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023, ఏప్రిల్ 17న త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ పదోన్నతి సాధించారు. కాగా, తాజాగా తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 14 , 2025 | 08:33 PM