Share News

Interrogation: రెండో రోజు కీర్తి తేజ విచారణ.. నిజం బయటపడేనా

ABN , Publish Date - Feb 15 , 2025 | 10:51 AM

Hyderabad: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య కేసులో నిందితుడి విచారణ కొనసాగుతోంది. రెండో రోజు కీర్తితేజను పోలీసులు విచారిస్తున్నారు. ఈరోజు కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Interrogation: రెండో రోజు కీర్తి తేజ విచారణ.. నిజం బయటపడేనా
Industrialist janardhan rao murder case

హైదరాబాద్, ఫిబ్రవరి 15: పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు హత్య కేసులో (Industrialist janardhan rao murder case) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న కీర్తి తేజను రెండో రోజు పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. తాత జనార్దన్ రావును 72 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు నిందితుడు. మొదటిరోజు విచారణలో భాగంగా పోలీసులకు కీర్తి తేజ సహకరించలేదని తెలుస్తోంది. హత్యకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు ఎంత ప్రశ్నించినా నోరు మెదపలేదని సమాచారం. ఈరోజు ఘటనాస్థలికి తీసుకుని వెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


రెండో రోజు విచారణలో భాగంగా కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి రోజు విచారణలో కీర్తి తేజ పోలీసులకు సహకరించకపోవడం, డొంకతిరుగుడు సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. హత్యకు దారి తీసిన పరిస్థితులపై కీర్తి తేజ నోరువిప్పని పరిస్థితి. ఎక్కడైతే తాత జనార్దన్ రావును అతికిరాతకంగా దాదాపు 72సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడో ఆ ప్రాంతంలో నిందితుడు కీర్తి తేజను తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్సన్ చేసే అవకాశం ఉంది. అయితే అమెరికాలో ఉన్న సమయంలో కీర్తి తేజ డ్రగ్స్‌కు బానిసయ్యారని, హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత తల్లి డిఅడిక్షన్ సెంటర్‌కు తీసుకెళ్లి అతడికి కౌన్సిలింగ్ ఇప్పించినప్పటికీ తీరు మారలేదు. అయితే ఇక్కడ కూడా డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడా, మద్యం మత్తులో కిరాతకానికి ఒడిగట్టాడా అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నారు పోలీసులు. ఇప్పటికే కీర్తి తేజకు సంబంధించిన కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్‌లను కూడా రికార్డు చేశారు. వారిచ్చిన ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తు్న్నారు. ఈరోజు సీన్ రీకన్‌స్ట్రక్షన్ తర్వాత మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జైల్లో వల్లభనేని వంశీ చిందులు.. పోలీసులు సీరియస్.. ఏం చేశారంటే..


కాగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్దన్ రావు.. సొంత మనవడి చేతిలోనే అతి దారుణంగా హత్యకు గురవడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వెల్జాన్‌ గ్రూపు సంస్థల అధినేత అయిన జనార్దన్ రావును మనవడు కీర్తి తేజ దారుణంగా 72 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆస్తి గొడవల కారణంగానే హత్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కంపెనీలో డైరెక్టర్‌ పోస్టును ఓ మనవడికి ఇచ్చారు జనార్దన్. తనకు కూడా డైరెక్టర్ పోస్టు కావాలని కీర్తి తేజ పట్టుబట్టగా అందుకు ఆయన నిరాకరించాడు. కీర్తి తేజ ఉన్న చెడు వ్యసనాల కారణంగా డైరెక్టర్ పోస్టు ఇచ్చేందుకు జనార్దన్ రావు అంగకీరించలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన కీర్తి తేజ తాత అని చూడకుండా జనార్దన్ రావు కత్తితో దాదాపు 72 సార్లు పొడిచాడు.. అంతేకాకుండా అడ్డుగా వచ్చిన తల్లిపై కూడా 12సార్లు కత్తితో దాడి చేశాడు. వెంటనే కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని అప్పటికే తీవ్రంగా గాయపడిన జనార్దన్ రావు మృతిచెందగా.. గాయాలపాలైన తల్లిని ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. హత్య అనంతరం పారిపోయిన కీర్తి తేజను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

జైల్లో వల్లభనేని వంశీ చిందులు.. పోలీసులు సీరియస్.. ఏం చేశారంటే..

గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 15 , 2025 | 10:52 AM