Share News

HYDRA: అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించిన హైడ్రా

ABN , Publish Date - Jan 10 , 2025 | 12:30 PM

HYDRA: నెక్నాంపూర్ చెరువు బఫర్ జోన్‌లో నిర్మించిన నాలుగు విల్లాలను నేలమట్టం చేసిన హైడ్రా సిబ్బంది.. మరో ఐదు విల్లాలను కూల్చివేయడానికి సన్నద్ధమయ్యారు. అయితే నెక్నాంపూర్ చెరువును కబ్జా చేయడంతో గతంలో రెవన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు కూల్చివేశారు. మూడు సార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమ నిర్మాణాలు వెలిశాయి.

HYDRA: అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించిన హైడ్రా
Hydra

హైదరాబాద్, జనవరి 10: నగరంలోని మణికొండలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRa) కొరడా ఝుళిపించింది. నెక్నాంపూర్ చెరువు బఫర్ జోన్‌లో ఆక్రమణలను కూల్చివేస్తోంది. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నెక్నాంపూర్ చెరువు బఫర్ జోన్‌లో నిర్మించిన నాలుగు విల్లాలను నేలమట్టం చేసిన హైడ్రా సిబ్బంది.. మరికొన్ని విల్లాలను కూల్చివేయడానికి సన్నద్ధమయ్యారు. అయితే నెక్నాంపూర్ చెరువును కబ్జా చేయడంతో గతంలో రెవన్యూ, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు కూల్చివేశారు. మూడు సార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ (HYDRA Chief Ranganath) ఆదేశాల మేరకు కూల్చివేతలు సాగుతున్నాయి. అలాగే విల్లాలను నిర్మించిన బిల్డర్లపైన హైడ్రా కేసు నమోదు చేసింది. నెక్నాంపూర్ చెరువుపై అక్రమంగా నిర్మించిన దాదాపు 10కి పైగా విల్లాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. గతంలో కూల్చివేతలు చేసినప్పటికీ తిరిగి నిర్మాణాలు చేయడంపై హైడ్రా అధికారులు సీరియస్ అయ్యారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు.


ఇందులో భాగంగా ఈరోజు కూల్చివేతలను చేపట్టింది హైడ్రా. దాదాపు నాలుగు విల్లాలను కూల్చివేసిన అధికారులు... మరో పది విల్లాలను కూల్చివేయనున్నట్లు తెలుస్తోంది. నెక్నాంపూర్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఈ నిర్మాణాలు వెలిశాయి. గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవన్యూ అధికారులు ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఆ తరువాత తిరిగి నిర్మాణాలు వెలిశాయి. మూడు సార్లు కూల్చివేతలు జరిగినప్పటికీ స్థానిక అధికారులను మేనేజ్ చేసుకుని అక్రమ నిర్మాణాలను చేస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో నెక్నాంపూర్ చెరువులో వెలసిన అక్రమ విల్లాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం హైడ్రా కమిషన్ రంగనాథ్ అక్కడకు చేరుకుని నెక్నాంపూర్ చెరువుకు సంబంధించిన లేఅవుట్‌లను పరిశీలించారు. ఎంత మేరకు అక్రమాలు జరిగాయనేదానిపై పూర్తి వివరాలు సేకరించిన తర్వాత.. స్థానిక అధికారులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

తెలంగాణలో ఆ పద్ధతి పెట్టాలి.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్


ఇటీవల కాలంలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. నగర శివారులో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లపై హైడ్రా ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ శివారు నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వాటిపై యాక్షన్ తీసుకోవాలని ఇప్పటికే హైడ్రా అధికారులకు హైడ్రా చీఫ్ కీలక ఆదేశాలు చేశారు. అందులో భాగంగానే మణికొండ నెక్నాంపూర్ చెరువులో వెలసిన అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈరోజు సాయంత్రం వరకు కూల్చివేతలు కొనసాగనున్నాయి.


ఇవి కూడా చదవండి...

లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చు.. నష్టం 5 లక్షల కోట్లు

Formula E Case: ఏసీబీ విచారణకు బీఎల్‌ఎన్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 10 , 2025 | 02:47 PM