Hyderabad Shivers in Cold Wave: వణికిస్తున్న చలిగాలులతో బయటకు రాని జనం
ABN , Publish Date - Dec 01 , 2025 | 09:47 AM
హైదరాబాద్ నగర వాసులను చలిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి తీవ్రతతో జనం స్వెటర్లు, మంకీ క్యాపులు లేకుండా బయటకు రావడం లేదు.
హైదరాబాద్, డిసెంబర్ 1: నగరవాసులు చలికి వణికిపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో స్వెటర్లు, మంకీ క్యాపులు లేకుండా బయటకు రావడం లేదు. చలిగాలుల తీవ్రత పెరగడంతో ఉదయం నడకకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. తెల్లవారుజామున ప్రధాన రహదారులను మంచు కప్పేయడంతో వాహనదారులు ముందుకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం వేళల్లో మంచు కురుస్తుండంతో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. శనివారం రాత్రి శేరిలింగంపల్లిలో 14.1, రామచంద్రాపురంలో 14.4, రాజేంద్ర నగర్లో 147 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదివారం హైదరాబాద్ జిల్లావ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 27.5, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17.4 డిగ్రీలుగా నమో దయ్యాయి. చక్రవాత (దిత్వా) తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో సోమవారం అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు గ్రేటర్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలుంటాయని పేర్కొ న్నారు. ఉపరితల గాలులు తూర్పు ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలుంటాయని చెప్పారు.
పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
శివారు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. గురువారం రాత్రి రామచంద్రా పురం, పటాన్చెరు ప్రాంతాల్లో 14.1, శుక్రవారం రాత్రి రామచంద్రాపురం, పటాన్చెరు ప్రాంతాల్లో 117, శనివారం రాత్రి శేరి లింగంపల్లిలో 14.1, రామచంద్రా పురం, పటాన్చెరు ప్రాంతాల్లో 14.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్ర తలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. చలి గాలుల తీవ్రత పెరగడంతో సీనియర్ సిటిజన్స్, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యాదాద్రిలో గిరి ప్రదక్షిణకు పోటెత్తిన స్వాములు
ఏలూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
For More TG News And Telugu News