Investment Scam: బై బ్యాక్ స్కీమ్ పేరిట భారీ మోసం.. కోట్లు సేకరించి ఊడాయించిన కేటుగాళ్లు..
ABN , Publish Date - Mar 12 , 2025 | 09:35 PM
సైబరాబాద్‍లో "బై బ్యాక్ స్కీమ్" పేరిట కేటుగాళ్లు ప్రజలను బురిడీ కొట్టించారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలంటూ కోట్లు రూపాయలు కొల్లగొట్టారు.

హైదరాబాద్: నగరంలో మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. అమాయకులే లక్ష్యంగా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. స్టాక్ మార్కెట్లు, బంగారం, ప్లాట్లపై పెట్టుబడి అంటూ అందిన కాడికి దోచేస్తున్నారు. లక్షలు, కోట్లు సేకరిస్తూ సొమ్ము చేతిలో పడిన వెంటనే ఉడాయిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మహానగరంలో చోటు చేసుకుంది.
"బై బ్యాక్ స్కీమ్" పేరిట ఓ సంస్థ రూ.12 కోట్లకు టోకరా పెట్టింది. వీ వోన్ ఇన్ఫ్రా గ్రూప్ (we own infra Group) పేరిత కూకట్‍పల్లిలో సంస్థను ప్రారంభించిన సురేశ్, వెంకటేశ్, వంశీకృష్ణ.. అమాయకులను నట్టేట ముంచేశారు. ఓపెన్ ప్లాట్లు, బంగారంపై పెట్టుబడులు పెడితే ‘బై బ్యాక్ పాలసీ’ కింద ప్రతి నెలా రిటర్స్న్ ఇస్తానని, అలాగే 25 నెలల్లో రెట్టింపు లాభాలు ఇస్తామని నమ్మబలికారు. ఏజెంట్లను నియమించుకుని 90 మంది నుంచి ఏకంగా రూ.12 కోట్లు వసూలు చేశారు. అయితే రెండు స్కీముల్లో పెట్టుబడి పెటిన వారంతా లాభాల కోసం ఎంత ఎదురు చూసినా నగదు మాత్రం చెల్లించలేదు సదరు నిర్వాహకులు. రోజులు, నెలలు గడుస్తున్నా డబ్బులు మాత్రం తిరిగి రావడం లేదు.
సంస్థ కార్యాలయానికి వెళ్లినా పొంతన లేని సమాధానాలు ఎదురవుతున్నాయి. మోసపోయామని గుర్తించిన 25 మంది బాధితులు సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నగదు ఎలాగైనా తిరిగి ఇప్పించాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు వెంకటేశ్, వంశీకృష్ణను అరెస్టు చేయగా.. ప్రధాన నిందితుడు, కీలక సూత్రధారి సురేశ్ మాత్రం పరారీలో ఉన్నాడు. అతని తీవ్రంగా గాలిస్తున్నామని, బాధితులకు ఎలాగైనా న్యాయం చేస్తామని ఈవోడబ్ల్యూ పోలీసులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
journalist Revathi: మహిళా జర్నలిస్టుకు 14 రోజుల రిమాండ్.. సంచలనం రేపుతున్న ఘటన..
Soundarya husband Raghu: ఆ విషయంపై నిజమేంటో తేల్చి చెప్పిన సౌందర్య భర్త..
KTR Drone Flying Case: కేటీఆర్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ.. అసలు విషయం ఇదే..