Telangana Govt: హైదరాబాద్‌కు అత్యాధునిక డేటా సెంటర్..
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:17 PM
Hyderabad: హైదరాబాద్‌కు దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు అమెరికా సంస్థ ముందుకు వచ్చింది. రూ.15,000 కోట్లతో టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది.
హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్‌కు (Hyderabad) పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్‌ను (Data Center) అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. రూ.15,000 కోట్లతో టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ (Tillman Global Holdings) ఎంవోయూ కుదర్చుకుంది. 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేసింది. టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రెసిడెంట్ సచిత్ అహుజాతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu), పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఉన్నతాధికారులు ఈ ఒప్పందం చేసుకున్నారు.
టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్‌తో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం హైదరాబాద్ స్థాయిని మరింత పెంచుతుందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావటం పట్ల టిల్‌మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ అధ్యక్షుడు సచిత్ అహుజా సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు, దార్శనిక నాయకత్వం తమను ఆకట్టుకుందని సచిత్ అన్నారు.
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు జైలు శిక్ష
అలాగే.. హైదరాబాద్‌లో 5000 కోట్ల పెట్టుబడులకు అమెరికా సంస్థ ఉర్సా క్లస్టర్స్ ముందుకొచ్చింది. ఉర్సా క్లస్టర్స్ రాష్ట్రంలో అత్యాధునిక అర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను ఉర్సా క్లస్టర్ స్థాపించనుంది. ఒప్పందంపై ఉర్సా క్లస్టర్ సీవోవో సతీష్ అబ్బూరి, సీఆర్వో ఎరిక్ వార్నర్ సంతకం చేశారు. అలాగే హైదరాబాద్‌లో మరో డేటా సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. బ్లాక్ స్టోన్ సంస్థ రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదర్చుకుంది. హైదరాబాద్‌లో 150 మెగావాట్ల డేటా సెంటర్‌ను బ్లాక్ స్టోన్ ఏర్పాటు చేయనుంది. ఏఐ ఆధారిత సేవలను డాటా సెంటర్ అందించనుంది.
కాగా.. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగింది. అనేక ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయి. దాదాపు 10 ప్రముఖ కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా.. 46 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇక నేటితో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగియనుండటంతో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. రేపు సీఎం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
ఇవి కూడా చదవండి..
సైఫ్ అలీఖాన్ కేసులో నిజాన్ని దాచిపెడుతున్నారా..!
Read Latest Telangana News And Telugu News