Share News

Hyderabad Bus Fire: హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు..

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:33 AM

నగరంలోని మెహిదీపట్నం బస్ స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్ భాగంలో ఒక్కసారిగ మంటలు అంటుకున్నాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యాడు. బస్సును పక్కకు నిలిపివేసి..

Hyderabad Bus Fire: హైదరాబాద్‌ ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు..
Hyderabad Bus Fire

హైదరాబాద్, ఆగస్టు 26: నగరంలోని మెహిదీపట్నం బస్ స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్ భాగంలో ఒక్కసారిగ మంటలు అంటుకున్నాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తం అయ్యాడు. బస్సును పక్కకు నిలిపివేసి.. ప్రయాణికులందరినీ కిందకు దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. బస్సు ముందు భాగం మొత్తం పూర్తిగా దగ్దం అయిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.


ప్రమాదం జరిగిందిలా..

మెహిదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. లింగంపల్లి నుంచి మెహిదీపట్నం చేరుకుంది. అదే సమయంలో బస్సు ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో డ్రైవర్.. బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. బస్సును సెల్ఫ్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించగా స్టార్ట్ కాలేదు. ప్రయాణికులందరూ కిందకు దిగిపోయారు. ఆ తరువాత డ్రైవర్ బానెట్ ఓపెన్ చేసి కేబుల్స్ సరి చేసే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. బస్సు ముందు భాగం పూర్తిగా దగ్దం అయ్యింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను పూర్తిగా ఆర్పేశారు. ఆర్టీసీ అధికారులు, పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలను ఆర్టీసీ మెకానికల్ విభాగం సిబ్బంది విశ్లేషిస్తున్నారు.


Also Read:

అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు

ఈ వాహనం సమీపానికి వెళ్లాలంటే..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 26 , 2025 | 11:33 AM