GHMC Arrangements for Ganesh Immersion: మహా నిమజ్జనానికి జిహెచ్ఎంసి భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:59 PM
హైదరాబాద్‌లో జరగనున్న నిమజ్జనానికి జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో..
హైదరాబాద్: వినాయక నిమజ్జన మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని జిహెచ్ఎంసి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో విగ్రహాల నిమజ్జనం సజావుగా సాగేందుకు క్రేన్లు, లైటింగ్, మొబైల్ టాయిలెట్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది.
హుస్సేన్ సాగర్ చుట్టూ 40 క్రేన్లు సిద్ధంగా ఉంచగా, నగర వ్యాప్తంగా 134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల వద్ద మాత్రమే విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. ఐదు ఫీట్ల లోపు విగ్రహాలను నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్ వద్ద ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం చేయాలని అధికారులు సూచించారు.
ప్రత్యేకంగా హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఫోకస్ లైట్లు, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. అదనంగా, మూడు షిఫ్టుల్లో సుమారు 4వేల మంది సిబ్బందితో క్లీనింగ్ పనులను చేపట్టనున్నారు. ట్యాంక్ బండ్‌పై నిమజ్జనానికి కేవలం చివరి రోజున మాత్రమే అనుమతించారు. ఈ మహా నిమజ్జనం కోసం జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, పోలీసులు, ఇతర శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. దాదాపు 50 వేల వినాయకుడి విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read:
నక్సల్స్ వ్యవస్థ నిర్మూలించే వరకూ విశ్రమించం : అమిత్ షా
ప్రపంచంలో అత్యంత పోషకమైన ఆహారం ఏదో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
For More Latest News