ACB Raids In Hyderabad: నగరంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు
ABN , Publish Date - Sep 16 , 2025 | 10:14 AM
విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రంగంలోకి దిగారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16: విద్యుత్ శాఖలో పలువురు ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రంగంలోకి దిగారు. అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలోని మణికొండలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న అంబేద్కర్ నివాసం, ఆయన బంధువుల నివాసాలతోపాటు ఆయన కార్యాలయంలో సైతం సోదాలు చేపట్టారు.
నగరంలోని మణికొండ, నార్సింగ్ డివిజన్లలో ఏడీగా అంబేద్కర్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈ తనిఖీల్లో భాగంగా అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు.. భారీగా వ్యవసాయ భూములు, స్థలాలతోపాటు భవనాలను అంబేద్కర్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
అయితే ఇలా కూడబెట్టిన ఆస్తులకు తన బంధువులను బినామీలుగా సదరు అధికారి అంబేద్కర్ ఉంచినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. దాంతో అంబేద్కర్ అవినీతి ఆస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు లెక్కిస్తున్నారు. అలాగే అంబేద్కర్‌కు హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు 15 బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు చేపట్టారు. ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
బొప్పాయి ఆకు జ్యూస్‌తో.. ఈ సమస్యలు దూరం..
For More TG News And Telugu News