Husband Kills Wife: బంధువుల ఇంట్లోనే భార్య పట్ల భర్త ఎంతకు తెగించాడంటే
ABN , Publish Date - Sep 20 , 2025 | 10:12 AM
కుషాయిగూడలో దారుణం జరిగింది. అనుమానంతో భర్త కట్టుకున్న భార్య మెడ కోసి దారుణంగా చంపేశాడు. మహారాష్ట్ర ముంబైకి చెందిన దంపతులు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 20: అనుమానం పెనుబూతం అన్నారు పెద్దలు. భార్య, భర్తల్లో ఏ ఒక్కరిలో అయినా అనుమానం మొదలైతే ఆ కాపురం సజావుగా సాగడం కష్టం అనే చెప్పుకోవాలి. అనుమానంతో ఎంతో మంది తమ భార్యలను అతి కిరాతంగా హత్య చేసిన ఉదంతాలు ఎన్నో చూశాం. కట్టుకున్న భార్య అని చూడకుండా వేధింపులకు గురిచేస్తూ చివరకు ప్రాణాలు తీసేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చేసుకుంది. అనుమానం అనే పెనుబూతానికి ఓ నిండు ప్రాణంబలైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.
కుషాయిగూడలో దారుణం జరిగింది. అనుమానంతో భర్త కట్టుకున్న భార్య మెడ కోసి దారుణంగా చంపేశాడు. మహారాష్ట్ర ముంబైకి చెందిన దంపతులు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మొదటి నుంచి భార్యపై భర్తకు అనుమానం ఉండేది. అది అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో కుషాయిగూడలోని రాధిక చౌరస్తాలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు దంపతులు. అయితే వారిద్దరి మధ్య ఏ జరిగిందో తెలియదు కానీ బంధువుల ఇంట్లోనే భార్యను భర్త చంపేశాడు.
భార్య మెడపై కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయడిన మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బంధువుల సమాచారం మేరకు కుషాయిగూడ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారైన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఆ ప్రాంతవాసులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
ఇవి కూడా చదవండి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగిసిన సిట్ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
నాలుగవ రోజుకు సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
Read Latest Telangana News And Telugu News