High Alert In Hyderabad: హైదరాబాద్‌లో హై అలర్ట్.. ఎమర్జెన్సీ నెంబర్లు ఇవే..
ABN , Publish Date - Aug 07 , 2025 | 10:15 PM
క్కసారిగా కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న ఈ వర్షం కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
హైదరాబాద్, ఆగస్ట్ 07: ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న ఈ వర్షం కారణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అలాగే పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీసి.. వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. అందులో భాగంగా హైదరాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఏర్పాటు చేశారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో..
వర్షం కారణంగా.. ఇళ్లలోకి నీళ్లు రావడం, ట్రాఫిక్ అంతరాయం, విద్యుత్ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్‌లోని ఈ ఫోన్ నెంబర్ 040 2302813 / 7416687878 కి కాల్ చేయాలన్న ప్రజలకు జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు. అలాగే అధికారులందరూ అందుబాటులో ఉంటూ.. హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో కలిసి పని చేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే రెవిన్యూ అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక హైదరాబాదు మహానగరంలో భారీ వర్షాల నేపథ్యంలో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు ఇవే..
ఎన్డీఆర్ఎఫ్ నెం: 8333068536,
ఐసీసీసీ: 8712596106.
హైడ్రా: 9154170992
ట్రాఫిక్: 8712660600
సైబరాబాద్ 8500411111
రాచకొండ 8712662999.
TGSPDCL ఫోన్ నెం.7901530966.
RTC 9444097000.
GHMC ఫోన్ నె.8125971221.
HMWSSB 9949930003.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కారణంగా..
నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
ఒకవైపు వర్షం, మరో వైపు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇక్కట్లు.
కిలోమీటర్ల మేరకు రోడ్లపై నిలిచిపోయిన ట్రాఫిక్.
చాదర్‌ఘాట్ నుంచి ఎల్బీనగర్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్.
జంటనగరాల్లో భారీగా వర్షపాతం నమోదు
ఖాజాగూడలో 12 సెంటీ మీటర్లు
ఎస్సార్ నగర్‌లో 11
ఖైరతాబాద్‌లో 11
సరూర్‌నగర్‌లో 10 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు.
అత్యధికంగా గచ్చిబౌలిలో 12.5 సెం.మీ. వర్షపాతం నమోదు
శ్రీనగర్ కాలనీలో 11.1,
యూసుఫ్ గూడలో 10.4,
ఉప్పల్‌లో 10,
బంజారాహిల్స్‌లో 9,
నాగోల్‌లో 8.8 సెంటీ మీటర్ల,
ఎల్బీనగర్‌లో 9.3 సెం.మీ,
గోల్కొండ 7.9 సెం.మీ
బోరబండ 7.5 సెం.మీ వర్షపాతం నమోదు.
ఈ వార్తలు కూడా చదవండి..
తురకా కిషోర్‌ను తక్షణమే విడుదల చేయండి: హైకోర్టు
సెల్ఫ్ డబ్బా.. ట్రంప్‌కి మోదీ కౌంటర్
For More Telangana News And Telugu News