Share News

Harish Rao: కేసీఆర్ ప్రెస్‌ మీట్ తర్వాత రేవంత్ సర్కార్‌ డిఫెన్స్‌లో పడింది: హరీశ్

ABN , Publish Date - Dec 23 , 2025 | 02:06 PM

తెలంగాణాలో కాంగ్రెస్ పాలపై మరోసారి మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి వాస్తు భయం పట్టుకుందని ఈ సందర్బంగా ఆయన విమర్శించారు.

Harish Rao: కేసీఆర్ ప్రెస్‌ మీట్ తర్వాత రేవంత్ సర్కార్‌ డిఫెన్స్‌లో పడింది: హరీశ్
Harish Rao

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్(CM KCR) ఇటీవల ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ సర్కార్ డిఫెన్స్‌లో పడిందని ఆయన అన్నారు. '25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా.‌ రాత్రి 9:30 గంటలకు ముఖ్యమంత్రి చిట్ చాట్ పెట్టడం నేను చూడలేదు. అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోలు, గ్లోబల్ సమ్మిట్‌లు అన్నం పెడతాయా? సీఎం రేవంత్‌ రెడ్డికి వాస్తు భయం పట్టుకుంది. అందుకే సచివాలయానికి వెళ్లడం లేదు' అని ఆయన విమర్శించారు.


ఇటీవల జరిగిన తెలంగాణా పంచాయతీ ఎన్నికల్లో.. బీఆర్ఎస్ 4 వేల సర్పంచ్‌‌ స్థానాల్లో గెలుపొందిందని హరీశ్ రావు అన్నారు. 'బీఆర్ఎస్ దెబ్బకు డీసీసీబీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు‌. కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేయాలని చూస్తున్నారు. పోలీసులు లేకుండా ఉస్మానియాకు వస్తానని.. పోలీస్ పహారాల మధ్య ఓయూకు వచ్చారు. ఇరిగేషన్‌పై పీపీటీని స్వాగతిస్తున్నాం. పీపీటీపై అసెంబ్లీలో మాకూ అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీలో మా గొంతు నొక్కడం.. మైక్ కట్ చేయవద్దు. ఎవరి వాదన నిజమో ప్రజలే తేల్చుతారు. సీపీఐ, ఎంఐఎం, బీజేపీ కంటే తక్కువ సమయం బీఆర్ఎస్‌కు ఇస్తున్నారు. బీఆర్ఎస్‌కు ప్రభుత్వం భయపడుతోంది. అవకాశం ఇస్తే.. అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ బట్టలు విప్పుతాం' అని కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు హరీశ్.


ఇవీ చదవండి:

మైగ్రేన్ తగ్గించే దివ్యౌషధం.. సింపుల్ చిట్కా.. చిన్న ముక్క ఇదిగో..

అసెంబ్లీ ఎన్నికలు.. సత్తా చాటిన బీజేపీ

Updated Date - Dec 23 , 2025 | 02:10 PM