HYDRA: అక్రమార్కులపై స్పెషల్ ఫోకస్ పెట్టిన హైడ్రా.. ఈసారి వాళ్లే టార్గెట్..
ABN , Publish Date - Feb 04 , 2025 | 09:59 PM
హైదరాబాద్: బండ్లగూడ, పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో టిప్పర్లు, జేసీబీల సహాయంతో చెరువుల్లో మట్టి పోస్తున్నట్లు హైడ్రా సిబ్బందికి సమాచారం అందింది. దీంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. నిందితులు మట్టి చదును చేస్తూ అడ్డంగా బుక్కైయ్యారు.
హైదరాబాద్: ప్రభుత్వ స్థలాలు, చెరువులు (Ponds) పరిరక్షించటమే లక్ష్యంగా హైడ్రా (HYDRA) పనిచేస్తున్న సంగతి తెలిసిందే. చెరువులు, ప్రభుత్వ స్థలాలు (Govt Lands) ఆక్రమించి ఇళ్లు కట్టిన వారిపై ఇప్పటికే హైడ్రా కొరఢా ఝుళిపిస్తోంది. ఎన్నో ఇళ్లను నేలమట్టం చేసి ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలిచింది. అయితే అంత కఠినంగా వ్యవహరించినా అక్రమార్కులు మాత్రం ఆగడం లేదు. హైదరాబాద్ పరిధిలో చెరువులను ఇంకా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాత్రి సమయాల్లో మట్టిని తీసుకువచ్చి చెరువులను చదును చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిపై నిఘాపెట్టి చెరువుల్లో మట్టి నింపుతున్న వారిని పట్టుకునే పయత్నాలను హైడ్రా ముమ్మరం చేసింది.
తాజాగా హైదరాబాద్ బండ్లగూడ, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో టిప్పర్లు, జేసీబీల సహాయంతో చెరువుల్లో మట్టి పోస్తున్నట్లు హైడ్రా సిబ్బందికి సమాచారం అందింది. దీంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. నిందితులు మట్టి చదును చేస్తూ అడ్డంగా బుక్కైయ్యారు. వాటిని వెంటనే అదుపులోకి తీసుకున్న సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో మట్టి, గృహ సంబంధ వ్యర్థాలు అక్రమంగా డంప్ చేసే వారిపైనా హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ స్థలాల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి: మంత్రి ఉత్తమ్..
Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. పేలిపోతున్న బ్యారెల్స్.. పరిస్థితి ఎలా ఉందంటే..