Share News

Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. పేలిపోతున్న బ్యారెల్స్.. పరిస్థితి ఎలా ఉందంటే..

ABN , Publish Date - Feb 04 , 2025 | 08:09 PM

హైదరాబాద్: చర్లపల్లి పారిశ్రామికవాడ సుగుణ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని కెమికల్ బ్యారెల్స్ ఒక్కొక్కటిగా పేలిపోతుండడంతో ప్రమాద తీవ్రత మరింత పెరుగుతోంది.

Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. పేలిపోతున్న బ్యారెల్స్.. పరిస్థితి ఎలా ఉందంటే..
Fire explosion

హైదరాబాద్: చర్లపల్లి పారిశ్రామికవాడ (Charlapalli Industrial Area)లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. సుగుణ రసాయన పరిశ్రమ (Sughuna Chemical Factory)లో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని కెమికల్ బ్యారెల్స్ ఒక్కొక్కటిగా పేలిపోతుండడంతో ప్రమాద తీవ్రత మరింత పెరుగుతోంది. భారీ పేలుళ్లతో మంటలు ఎగసిపడుతూ దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతం మెుత్తం వ్యాప్తిస్తోంది. ఫ్యాక్టరీ పక్కనే రహదారి ఉండడంతో పేలుళ్ల ధాటికి ప్రయాణికులు పరుగులు తీశారు. స్థానికులు సైతం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే పయత్నాలు ముమ్మరం చేశారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 04 , 2025 | 08:12 PM