Share News

Hyderabad: ఘట్‌కేసర్‌ కారు ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..

ABN , Publish Date - Jan 06 , 2025 | 09:43 PM

హైదరాబాద్: ఘట్‌కేసర్‌ (Ghatkesar)లోని ఘన్‌పూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు(Ghanpur ORR Service Road)పై కారు ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కారు ప్రమాదవశాత్తూ దగ్ధం కాలేదని సూసైడ్ అటెంప్ట్‌లో భాగంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Hyderabad: ఘట్‌కేసర్‌ కారు ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..
Car Fire Accident

హైదరాబాద్: ఘట్‌కేసర్‌ (Ghatkesar)లోని ఘన్‌పూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు (Ghanpur ORR Service Road)పై కారు ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కారు ప్రమాదవశాత్తూ దగ్ధం కాలేదని సూసైడ్ అటెంప్ట్‌లో భాగంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి నారపల్లికి చెందిన శ్రీరామ్‌ (Sriram)గా పోలీసులు గుర్తించగా, మృతురాలూ అదే గ్రామానికి చెందిన యువతిగా నిర్ధరించారు. నారపల్లి (Narapally)లో శ్రీరామ్ సైకిల్ షాప్ నిర్వహిస్తుండగా.. ఆ యువతి, శ్రీరామ్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది.

Hyderabad: హైడ్రా ప్రజావాణి.. ఒక్కరోజులో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయంటే..


అయితే కొంతమంది వ్యక్తులు శ్రీరామ్‌ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడమే కాకుండా టార్చర్ పెడుతున్నట్లు సమాచారం. వారి వేధింపులు తట్టుకోలేకే ప్రేయసితో కలిసి శ్రీరామ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సూసైడ్ నోట్ సైతం లభ్యం కాగా, అందులో అతన్ని బ్లాక్మెయిల్ చేసిన వారి వివరాలు ఉన్నట్లు సమాచారం. ఘటనకి ముందు తాను చనిపోతున్నట్లు శ్రీరామ్ తన సోదరునికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు వారిద్దరూ మేడిపల్లిలోని ఓ ట్రావెల్ కంపెనీ నుంచి కారును అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Hyderabad: బాబోయ్.. దారుణ ఘటన.. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు..


కారు దగ్ధమైన సమయంలో మంటలు అంటుకున్న శ్రీరామ్.. కారు నుంచి బయటకు వచ్చేశాడు. అనంతరం ఫుట్‌పాత్‌పై పడిపోయి మృతిచెందాడు. డ్రైవర్ సీటు పక్కనే యువతి కూర్చొని ఉంది. ఆమె మాత్రం బయటకు రాలేకపోయింది. ఎముకలు తప్ప యువతి శరీరం మెుత్తం కాలిబూడిదైంది. ప్రమాద దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటివరకూ వారి మృతదేహాలను ఆస్పత్రికి తరలించలేదు. మల్కాజ్ గిరి ఏసీపీ చక్రపాణి, ఘట్‌కేసర్ సీఐ పరశురామ్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శ్రీరామ్‌ను బ్లాక్మెయిల్ చేసిందెవరు?, ఏ విషయంలో అతన్ని వేధించారు?, వారిద్దరి మృతికి మరేదైనా కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Delhi: మోహన్ బాబు కేసు విచారణలో ట్విస్ట్.. ఆ రోజు విచారణ చేస్తామన్న సుప్రీంకోర్టు..

Hyderabad: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు.. పర్మిషన్ తీసుకోవాల్సిందే..

Updated Date - Jan 06 , 2025 | 09:45 PM