Share News

KCR: కేసీఆర్ ఇంట విషాదం.. కన్నీటిపర్యంతమైన మాజీ సీఎం

ABN , Publish Date - Jan 25 , 2025 | 09:29 AM

KCR Sister: కేసీఆర్ సోదరి సకలమ్మ (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సకలమ్మను కుటుంబసభ్యులు సికింద్రబాద్ యశోదా ఆస్పత్రిలో చేర్చారు. కొంతకాలంగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

KCR: కేసీఆర్ ఇంట విషాదం.. కన్నీటిపర్యంతమైన మాజీ సీఎం
KCR Sister

హైదరాబాద్, జనవరి 25: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (Former CM KCR) ఇంట విషాదం నెలకొంది. కేసీఆర్ సోదరి సకలమ్మ (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చేర్చారు. కొంతకాలంగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. సోదరి మరణవార్త తెలిసి మాజీ సీఎం కన్నీటి పర్యంతమయ్యారు. సకలమ్మ భర్త హన్మంతరావు కొన్నాళ్ల క్రితమే మృతి చెందారు. సకలమ్మ, హన్మంతరావు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు.


మాజీ సీఎంకు మొత్తం ఎనిమిది మంది సోదరీమణులు ఉండగా.. వారిలో సకలమ్మ ఐదవ సోదరి. సకలమ్మ మృతి విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, కవిత వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర గ్రామం. ఈరోజు సకలమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు, బంధువులు తెలిపారు. సకలమ్మ మరణంపై బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. కాగా.. 2018లో కేసీఆర్ రెండో సోదరి విమలాబాయి, మరో సోదరి లీలమ్మలు చనిపోయిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

Hyderabad: ముగిసిన ఐటీ సోదాలు.. ఐదు రోజులుగా నిర్మాతలు, డైరెక్టర్ల ఇళ్లపై దాడులు

Hyderabad: ఘోర ప్రమాదం.. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. చివరికి ఏమైందంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 25 , 2025 | 09:37 AM