Share News

Hyderabad Restaurants: ప్రముఖ రెస్టారెంట్లలో తనిఖీలు.. అవాక్కైన అధికారులు.. ఏం జరిగిందంటే

ABN , Publish Date - Feb 03 , 2025 | 01:30 PM

Hyderabad Restaurants: జీహెచ్‌ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడుల్లో భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ రెస్టారెంట్లలో దాడులు చేసిన సమయంలో కిచెన్‌లో పరిస్థితి చూసి ఫుడ్‌సేఫ్టీ అధికారులే అవక్కైన పరిస్థితి నెలకొంది. రోజుల తరపడి ఆహార పదర్ధాలు నిల్వ ఉండేందుకు ప్రమాదకరమైన సిట్రిక్ యాసిడ్‌లను ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు అధికారులు.

Hyderabad Restaurants: ప్రముఖ రెస్టారెంట్లలో తనిఖీలు.. అవాక్కైన అధికారులు.. ఏం జరిగిందంటే
Food safety Inspection

హైదరాబాద్, ఫిబ్రవరి 3: నగరంలో మరోసారి ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు (Food safety Inspection) నిర్వహించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని (Jubilee Hills) పలు రెస్టారెంట్లలో అధికారులు తనిఖీలు చేయగా.. ఫుడ్‌ తయారీలో హానికరమైన పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. పోష్ నాష్ లాంజ్ అండ్ బార్, కేక్ ది హట్టి రెస్టారెంట్లు నిబంధనలు పాటించలేదని అధికారులు గుర్తించారు. అలాగే హానికరమైన సిట్రిక్ యాసిడ్‌ను ఆహారంలో వాడుతున్నట్లు అధికారులు తనిఖీల్లో బయటపడింది. ఆహార పదార్థాల్లో ఫుడ్ కలర్స్, టేస్టింగ్ సాల్ట్ మోతాదుకు మించి వినియోగిస్తున్నారని.. కుళ్లిపోయిన కూరగాయలు వాడుతున్నట్లు అధికారులు కనుగొన్నారు. కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతున్నాయని కూడా గమనించారు. గడువు ముగిసిన పదార్థాలను ఆహారపదార్థాలల్లో వాడుతున్నారని బయటపడింది. అలాగే పోష్ నాష్ లాంజ్ అండ్ బార్ లైసెన్స్ గడువు కూడా ముగిసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.


జీహెచ్‌ఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడుల్లో భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ రెస్టారెంట్లలో దాడులు చేసిన సమయంలో కిచెన్‌లో పరిస్థితి చూసి ఫుడ్‌సేఫ్టీ అధికారులే అవక్కైన పరిస్థితి నెలకొంది. రోజుల తరపడి ఆహార పదర్ధాలు నిల్వ ఉండేందుకు ప్రమాదకరమైన సిట్రిక్ యాసిడ్‌లను ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. రోజుల తరబడి నిల్వ ఉంచే అల్లం వెల్లుల్లి పేస్టులను కూడా వాడుతున్నట్లు బటయపడింది. సిట్రిక్ యాసిడ్‌ను వాడటం వల్ల రోజుల తరబడి చికెన్, మటన్, ఫిష్, పన్నీర్ వంటి వాటిని నిల్వ ఉంచే అవకాశం ఉంటుంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు..


వీటిని మోతాదుకు మించి ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి హానీకరమైన కెమికల్స్‌ను ఆహారపదార్థాల్లో ఉపయోగించడం నిషిద్ధం. అయినా కూడా ఫుడ్‌సేప్టీ నిబంధనలను తుంగలోతొక్కి మరీ నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్ నిర్వాహకులు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఉన్న ప్రముఖ రెస్టారెంట్లపై నాన్‌స్టాప్‌గా దాడులు కొనసాగుతున్నాయి. పలు రెస్టారెంట్లను సీజ్‌ చేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రెస్టారెంట్లపై ఫుడ్‌సేఫ్టీ అధికారులు కేసులు నమోదు చేశారు.


ఇవి కూడా చదవండి..

Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు

Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 03 , 2025 | 01:30 PM