Share News

Fraud Case: వీడు మామూలోడు కాదు.. వృద్ధురాలిని ఎంత ఈజీగా మోసం చేశాడంటే

ABN , Publish Date - Apr 30 , 2025 | 01:33 PM

Fraud Case: వృద్ధురాలి పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ఆమెను నమ్మించి కోట్లు కాజేశాడు. చివరకు మోసపోయానని గుర్తించిన వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది.

Fraud Case: వీడు మామూలోడు కాదు.. వృద్ధురాలిని ఎంత ఈజీగా మోసం చేశాడంటే
Fraud Case

హైదరాబాద్, ఏప్రిల్ 30: మోసపోయే వాళ్లు ఉంటే.. మోసగించే వాళ్లు కోకొళ్లుగా ఉంటారు. సొంతవారినే నమ్మించి నట్టేట ముంచుతారు. ముందు అంతా మంచిగా ఉన్నట్లు నటించి.. ఆపై తమ అవసరం తీరిపోగానే అసలు రూపాన్ని బయటకు తీస్తారు. మోసం చేసే వారిని గుర్తించే లోపే.. ఉన్నదంతా ఊస్టు కూడా అయిపోతుంది. మోసం చేసే వారి మాటలు కూడా ఎంతో తీయగా ఉంటాయి. అమాయకులను తమ మాటలతో ఈజీగా నమ్మించేస్తారు. తమకు కావాల్సింది దక్కగానే వారికి కనిపించకుండా పరారవుతుంటారు. లేదా మోసపోయినట్లు గుర్తించి నిలదీస్తే వారిని బెదిరింపులకు పాల్పడతారు. అంతేకాకుండా ప్రాణాలు తీసేందుకు వెనకాడరు మోసగాళ్లు. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వృద్ధిరాలి పట్ల కేటుగాడు చేసిన మోసం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వృద్ధురాలు ఎలా మోసపోయింది.. ఆ కేటుగాడు ఎలా మోసం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.


హబ్సిగూడకు చెందిన వృద్ధురాలకి నాగేశ్వర్ శర్మ 2022లో పరిచయం అయ్యాడు. వృద్ధురాలితో మంచిగా ఉన్నట్లు నటిస్తూ ఆమె వెనక మోసానికి తెరతీశాడు. ఈ విషయాలేమి తెలియని వృద్ధురాలు.. నాగేశ్వర్‌ను ఎంతో నమ్మింది. కోట్లలో నగదును అతడికి ఇచ్చింది. చివరకు మోసపోయినట్లు గుర్తించిన వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది. వేలంలో ఆస్తులు ఇప్పిస్తానంటూ వృద్ధురాలి నుంచి దాదాపు 5.71 కోట్ల రూపాయలను కాజేశాడు కేటుగాడు.

10th Results: మరికాసేపట్లో టెన్త్ రిజల్ట్స్.. చెక్‌ చేసుకోండిలా


తాను స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆస్తుల విభాగం మేనేజర్‌గా పనిచేస్తున్నానంటూ వృద్ధురాలిని నమ్మించాడు నాగేశ్వర్. ఎస్‌బీఐ.. వేలంలో బంగారం, ఫ్లాట్లు, కార్లు విక్రయిస్తోందని.. తక్కువ ధరకే వస్తాయని నమ్మబలిగారు. ఇది నిజమని నమ్మిన వృద్ధురాలు నాగేశ్వర్‌కు పెద్దమొత్తంలో డబ్బులు సమర్పించింది. వృద్ధురాలికి అనుమానం రాకుండా 4 ఫ్లాట్లు, 4 ప్లాట్లు, 2 కార్లు వేలంలో ఇప్పించినట్లు ఫేక్ డాక్యుమెంట్లు కూడా సృష్టించాడు. దీంతో పలు దఫాల్లో దాదాపు రూ.5.71 కోట్ల రూపాయలను నాగేశ్వర్‌కు ఇచ్చింది. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో అనుమానం వచ్చిన వృద్ధురాలు.. నాగేశ్వర్‌ను నిలదీసింది. దీంతో తన అసలు రంగును బయటపెట్టాడు కేటుగాడు. డబ్బులు ఇచ్చేది లేదని, ఇంకా ఎక్కువగా వాగితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగారు. తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు


ఇవి కూడా చదవండి

PM Modi: గోడ కూలి ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం..

SSC Results: మరికొద్దిసేపట్లో పదో తరగతి ఫలితాలు.. విద్యార్థుల్లో ఉత్కంఠ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 30 , 2025 | 01:36 PM