Hyderabad Metro Services Rush: సిటీ బస్సులు బంద్.. మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ
ABN , Publish Date - Oct 18 , 2025 | 08:25 AM
దీపావళి సందర్భంగా హైదరాబాద్ లోని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నగరంలోని సిటీ బస్సులు బంద్ కావడంతో సొంత ఊర్లకు వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు.
హైదరాబాద్: తెలంగాణ బంద్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోవడంతో దీపావళి సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లేందుకు నానావస్థలు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. నగరంలోని సిటీ బస్సుల బంద్ కారణంగా పండుగకు సొంత ఊర్లకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ తెలంగాణ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ మద్దతుగా బంద్ పాటిస్తున్నాయి.

ఈ క్రమంలోనే సిటీ బస్సులు కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. నగరంలోని సిటీ బస్సులు బంద్ కావడంతో సొంత ఊర్లకు వెళ్లడానికి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. మెట్రో రైళ్ల సర్వీసులు యథావిధిగా కొనసాగుతుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రధాన మెట్రో స్టేషన్ల వద్ద ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీ నగర్, అమీర్ పేట్ వంటి కేంద్రాల్లో ఫుల్ రష్ కనిపిస్తోంది.
Also Read:
ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు.. తుపాకి, బుల్లెట్లు స్వాధీనం
హాస్టళ్ల విద్యార్థుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
For More Latest News