Addanki Dayakar Reaction: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కామెంట్స్.. అద్దంకి రియాక్షన్
ABN , Publish Date - May 14 , 2025 | 05:05 PM
Addanki Dayakar Reaction: ‘ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఎవరి వర్గం. ఈటెల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎవరి వర్గం నువ్వు. జూన్ 2 లేదా డిసెంబర్‌లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకపోతే బీజేపీ పార్టీని రాష్ట్రంలో నిషేధిస్తారా’ అంటూ అద్దంకి దయాకర్ మండిపడ్డారు.
హైదరాబాద్, మే 14: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య డీల్ కుదిరిందని, విలీనం ఖాయమంటూ బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ (BJP Leader NVSS Prabhakar) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు (Congress Leaders) మండిపడుతున్నారు. బీజేపీ వాళ్లకు మెదడు మోకాళ్ళలో ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (MLC Addanki Dayakar) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ వాళ్ళ బుద్ధిలో మార్పు రావడం లేదన్నారు. అబద్ధాలు ప్రచారం చేయడంలో బీజేపీ వాళ్ళు దిట్ట అంటూ మండిపడ్డారు. నియంతలకు అబద్దాల మీద బాగా ప్రేమ ఉంటుందన్నారు. బీజేపీ వాళ్ళు చాలా జోక్‌గా మాట్లాడుతున్నారని.. బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ ఎందుకు విలీనం అవుతుందని ప్రశ్నించారు.
‘ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఎవరి వర్గం. ఈటెల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎవరి వర్గం నువ్వు. ఈటలను కేసీఆర్ పక్కకు పెట్టినప్పుడు కూడా ఇన్ని మాటలు మాట్లాడలేదు. జూన్ 2 లేదా డిసెంబర్‌లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకపోతే బీజేపీ పార్టీని రాష్ట్రంలో నిషేధిస్తారా.. మాతో పోరాటం మీకు చేత కావడం లేదా’ అంటూ ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటే అని ఆరోపించారు. ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ గతంలో ఇలాగే కారు కూతలు కూశారని.. అప్పుడు ఏమైందో ఆయనకు తెలుసన్నారు. ఈ టర్మ్ కాదు వచ్చే టర్మ్ కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని బీజేపీ వాళ్లకు క్లారిటీ ఉందన్నారు.
Operation Sindoor: చైనాకు భారత్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు
కాంగ్రెస్ ఎప్పటికీ కలవదని... ఈ మాటే రాహుల్ గాంధీ చెప్పారని స్పష్టం చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ పార్టీకి చీకటి రాజకీయ ఒప్పందం ఉందని ఆరోపించారు. ఆంధ్రాలో బీజేపీకి వైసీపీ, టీడీపీ, జనసేన బీ టీమ్స్ అని అన్నారు. కమలం కాడకు గులాబీ పువ్వుతో అంటు కట్టారంటూ వ్యాఖ్యలు చేశారు. ‘కొడకా అని మిమ్మల్ని అంటే ఊరుకుంటారా’ అంటూ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ కామెంట్స్ ఇవే
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ గురించి బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇరు పార్టీ మధ్య డీల్ కుదరిందన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ విలీనం కాబోతోందని, రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం కాబోతున్నారని అన్నారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం జరుగుతుందంటూ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ కామెంట్స్ చేశారు.
ఇవి కూడా చదవండి
AP Liquor Scam: గోవిందప్పను కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు.. అంతలోనే
CAIT Letter To Piyush Goyal: ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫారాలపై పాక్ జెండాలు.. సీఏఐటీ అభ్యంతరం
Read Latest Telangana News And Telugu News