CM Revanth reddy: హైడ్రాకు మరో కీలక బాధ్యత అప్పగించిన సీఎం రేవంత్
ABN , Publish Date - Feb 10 , 2025 | 09:36 PM
CM Revanth reddy: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు మరో బాధ్యత కట్టబెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతోన్న సంగతి అందరికి తెలిసిందే. అలాంటి హైడ్రాకు మరో కీలక బాధ్యతను అప్పగించారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: తెలంగాణలో ఇసుక తవ్వకాలు, రవాణాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులోభాగంగా ఉన్నతాధికారులకు సోమవారం హైదరాబాద్‌లో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా పటిష్టమైన చర్యలకు ఉపక్రమించాలని చెప్పారు.
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్‌ల వద్ద తరచూ తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఉన్నతాధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
Also Read: మహా శివరాత్రి పర్వదినం.. మంత్రి ఆనంకు సీఎం కీలక ఆదేశాలు
వీటిని జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యతను హైడ్రాకు అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ ఫోర్స్‌మెంట్ నిఘా ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొ్న్నారు.
Also Read: రంగరాజన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్.. కీలక ఆదేశాలు
ఇక ప్రతీ ఇసుక రీచ్‌ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టు దిట్టమైన ఫెన్సింగ్‌తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్‌లు ఏర్పాటు చేయాలంటూ అధికారులకు సీఎం రేవంత్ కీలక సూచనలు చేశారు. రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
Also Read: అప్పు చేయడం తప్పు కాదు కానీ..
ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏరియాల వారీగా సమీప రీచ్‌ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా వ్యవస్థ పటిష్టంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని వివరించారు. సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం జరిగేలా చూడాలన్నారు.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?
నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని అధికారులకు సీఎం సూచించారు. అలాగే ఆన్ లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులకు సంబంధించి సీఎం రేవంత్ ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.
Also Read: ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు.. జగన్ వస్తారా?
ఆఫీస్ టైమింగ్స్‌లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళల్లో మార్పు తీసుకు రావాలన్నారు. అక్రమ రవాణాకు సహకరించే అధికారులపై వేటు తప్పదని సీఎం రేవంత్ హెచ్చరించారు. అందులో ఎవ్వరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగి ఆకస్మిక తనిఖీలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పారదర్శకంగా అక్రమాలకు తావు లేకుండా పర్మినెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు
Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
For Telangana News And Telugu News