CM Revanth Reddy : వర్షాలు, వరదలు, ఉత్పన్నమైన పరిస్థితులుపై సీఎం రేవంత్ సమీక్ష
ABN , Publish Date - Aug 28 , 2025 | 05:15 PM
తెలంగాణ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కూడా ఉన్నారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో సీఎం రేవంత్..
హైదరాబాద్, ఆగస్టు 28 : రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, ఉత్పన్నమైన పరిస్థితులు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జూబ్లీహిల్స్ నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శీతక్క, తెలంగాణ చీఫ్ సెక్రటరీతోపాటు, ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయటంతో పాటు తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్థానికంగా ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం చెప్పారు.
అనంతరం, తెలంగాణ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. తెలంగాణలోని ముంపు ప్రాంతాలను పరిశీలించెందుకు సీఎం రేవంత్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. సీఎం వెంట ఏరియల్ సర్వేకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ పరిశీలించారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి