Share News

CM Revanth: రేవంత్ సింగపూర్ పర్యటన.. తొలిరోజే కీలక ఒప్పందం

ABN , Publish Date - Jan 17 , 2025 | 03:37 PM

CM Revanth: ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనలో తొలిరోజు విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, అధునాతన సదుపాయాలను పరిశీలించారు. అక్కడ శిక్షణను అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడారు.

CM Revanth: రేవంత్ సింగపూర్ పర్యటన.. తొలిరోజే కీలక ఒప్పందం
CM Revanth Reddy

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి తొలిరోజు పర్యటనలోనే కీలక ఒప్పందం జరిగింది. సింగపూర్ ఐటీఈ ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌తో తెలంగాణలో ఎంగ్ ఇండియా యూనివర్సిటీ ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఐటీఈ పాఠ్యాంశాలను స్కిల్ వర్శిటీ ఉపయోగించుకోనుంది. ఈ మేరకు స్కిల్ యూనివర్సిటీ వీసీ, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ మధ్య ఒప్పందం కుదిరింది.


ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనలో తొలిరోజు విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, అధునాతన సదుపాయాలను పరిశీలించారు. అక్కడ శిక్షణను అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడారు. అనంతరం ఐటీఈ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. హైదరాబాదులోని ఫోర్ల్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరును ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

గుడ్ న్యూస్.. త్వరలోనే వారి ఖాతాల్లోకి డబ్బులు..!


నైపుణ్యాల అభివృద్ధి (స్కిల్ డెవెలప్మెంట్) శిక్షణలో భాగస్వామ్యం కోసం పరస్పర సహకారం అందించాలని కోరారు. దీనిపై ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పని చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. చర్చల అనంతరం నైపుణ్యాల అభివృద్ధిలో కలిసి పని చేసేందుకు ఐటీఈ, స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై యూనివర్సిటీ వీసీ సుబ్బారావు, సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం తరఫున అకడిమిక్ అండ్ అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్ సింగ్, ఐటీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ సంతకాలు చేశారు. త్వరలోనే ఐటీఈ ప్రతినిధి బృందం హైదరాబాద్‌ను సందర్శించనుంది.


సింగపూర్ మంత్రితో...

revanth-singapur.jpg

కాగా.. ఈరోజు ఉదయం సింగపూర్ విదేశాంగ మంత్రి వీవీఎన్ బాలకృష్ణతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ, మూసీ పునరుజ్జీవనం, పర్యాటకం, విద్య, ఐటీ, నైపుణ్య నిర్మాణంపై వారు చర్చించారు. సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌రంజన్ భేటీలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏఐతో ఇలా కూడా చేస్తారా.. ఏకంగా దేశ ప్రధానినే

Kaushikreddy: కావాలనే కేసులు.. విచారణ తర్వాత కౌశిక్ రెడ్డి కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 17 , 2025 | 03:40 PM