Share News

CM Revanth Reddy District Tour: జిల్లాల పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్..షెడ్యూల్ ఇదే..

ABN , Publish Date - Nov 28 , 2025 | 05:30 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.

CM Revanth Reddy District Tour: జిల్లాల పర్యటనకు సిద్ధమైన సీఎం రేవంత్..షెడ్యూల్ ఇదే..
CM Revanth Reddy District Tour

హైదరాబాద్: జిల్లాల పర్యటనకు సీఎం రేవంత్ సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మొత్తం ఆరు రోజుల పాటు సీఎం జిల్లాల టూర్ కొనసాగనుంది. ఆరు రోజులు ఆరు జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటించనున్నారు.

సీఎం రేవంత్ పర్యటన షెడ్యూల్ ఇదే..

  • డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్

  • డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం

  • డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్

  • డిసెంబర్ 4న ఆదిలాబాద్

  • డిసెంబర్ 5న నర్సంపేట

  • డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండ


పంచాయతీ ఎన్నికలే టార్గెట్..

కాగా, తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. మొదటి విడత వచ్చే నెల డిసెంబర్ 11, రెండో విడత డిసెంబర్ 14, మూడో విడత డిసెంబర్ 17వ తేదీన ఉంటుంది. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారని తెలుస్తోంది. తాజాగా, సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది.


Also Read:

77 అడుగుల రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ

అమరావతి కోసం రుణం.. ఆమోదించిన ప్రభుత్వం

For More Latest News

Updated Date - Nov 28 , 2025 | 06:02 PM