Share News

CM Revanth On Elections: స్థానిక సంస్థల ఎన్నికలు.. సీఎం కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 09 , 2025 | 12:37 PM

పీసీసీ లీగల్ టీమ్ నుంచి నామినేషన్ అప్లికేషన్‌కు సంబంధించి మోడల్ ఫార్మాట్ క్షేత్రస్థాయికి పంపించాలని సీఎం రేవంత్ సూచించారు. గాంధీ భవన్ లో లీగల్ అంశాలను నివృత్తి చేసేందుకు కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలని నేతలకు తెలిపారు.

CM Revanth On Elections: స్థానిక సంస్థల ఎన్నికలు.. సీఎం కీలక ఆదేశాలు
CM Revanth On Elections

హైదరాబాద్, అక్టోబర్ 9: ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పరిస్థితులను ఎదుర్కొని ముందుకెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈరోజు (గురువారం) కాంగ్రెస్ నేతలతో పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. స్థానిక ఎన్నికలు, నామినేషన్ పక్రియపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన పీసీసీ ఛీఫ్. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని నేతలను ఉద్దేశించి మాట్లాడారు. నేటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. వివిధ జిల్లాలకు సంబంధించిన ఇంచార్జి మంత్రులు ముఖ్య నాయకులతో సమావేశమై రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఫైనల్ చేయాలని సూచించారు.


పూర్తిస్థాయిలో సమయం కేటాయించి నామినేషన్ల ప్రక్రియకు సమయం కేటాయించాలన్నారు. పీసీసీ లీగల్ టీమ్ నుంచి నామినేషన్ అప్లికేషన్‌కు సంబంధించి మోడల్ ఫార్మాట్ క్షేత్రస్థాయికి పంపించాలని సూచించారు. గాంధీ భవన్‌లో లీగల్ అంశాలను నివృత్తి చేసేందుకు కో- ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలని నేతలకు తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉన్నవారు కమిటీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ పదవుల ఎంపికపై పీసీసీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని.. అప్పటివరకు వాటిపై రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని సీఎం ఆదేశించారు.


బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో జరిగే వాదనలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని సూచించారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసుపై పీసీసీ అధ్యక్షుడు పర్యవేక్షణ చేయాలని సీఎం తెలిపారు. కోర్ట్ తీర్పు తరవాత తదుపరి కార్యాచరణ కోసం రాత్రికి మరో సమావేశం ఉంటుందన్నారు. తొలివిడత కోసం రాత్రికి అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి..

చలో బస్ భవన్.. బీఆర్‌ఎస్ నేతల హౌస్ అరెస్ట్

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 09 , 2025 | 12:52 PM