Harassment On Minors: తెలంగాణలో దారుణం.. చిన్నారులపై
ABN , Publish Date - Apr 17 , 2025 | 01:52 PM
Harassment On Minors: తెలంగాణలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. కామాంధులను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 17: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముక్కుపచ్చలారని పసివాళ్లపై కామాంధులు రెచ్చిపోయి ప్రవర్తించారు. వారిని లైంగికంగా వేధింపులకు గురిచేశారు. కామాంధుల దాడులతో చిన్నారులు చిగురుటాకుళ్లా వణికిపోయారు. ఈ రెండు ఘటనలు వెలుగులోకి రావడంతో వీళ్లు మనుషులా మృగాళ్లా.. చిన్నపిల్లలపై ఏంటి ఈ అఘాయిత్యాలు అంటూ ప్రజలు మండిపడుతున్నారు. వరంగల్, హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులపై కామాంధులు తమ పైశాచికత్వాన్ని చూపారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
చిన్నారిపై లైంగిక దాడి
వరంగల్ జిల్లా గిర్మాజి పేటలో దారుణం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన యువకుడు మూడేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పాప ఏడవడంతో గమనించిన స్థానికులు యువకుడు రంజాన్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై ఫోక్సో, అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఉత్తరప్రదేశకు చెందిన వ్యక్తి కూలీ పనుల కోసం గిర్మాజీ పేటకు వచ్చి అద్దెకు ఉంటున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పక్కనే ఉన్న మూడేళ్ల బాలికపై అతడి కన్ను పడింది. ఎవరూ లేని సమయంలో ఆ బాలికను బలత్కారం చేసేందుకు యత్నించాడు. యువకుడు చేస్తున్న పనితో బాలిక భయందోళనకు గురై ఏడ్చడంతో స్థానికులు అక్కడకు చేరుకుని అతడిని పట్టుకున్నారు. అతడు చేస్తున్న పని తెలిసి చితకబాదారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Tirupati Hostel Incident: విద్యార్థినిల గదిలోకి ప్రిన్సిపాల్.. తిరుపతిలో దారుణం
ఆరేళ్ల బాలికపై..
ఇటు హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నగరంలోని హుమాయున్‌నగర్‌లో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై కిరాణా షాప్ యజమాని అబ్దుల్ రౌఫ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బడాకట్టర్‌లో అబ్దుల్ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా వస్తున్న ఆరేళ్ల బాలికపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు నిందితుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో అబ్దుల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి
Tirupati: భూమనకు పల్లా శ్రీనివాస్ సవాల్
Chanakya Niti: ఈ తప్పులు చేస్తే జీవితాంతం పేదరికంలో మగ్గిపోతారు..
Read Latest Telangana News And Telugu News