Forest department: పెండింగ్ ప్రాజెక్ట్‌లపై కేంద్ర అటవీశాఖ సమీక్ష
ABN , Publish Date - Jan 18 , 2025 | 02:49 PM
Telangana: ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు. తెలంగాణలో 161 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నగరానికి వచ్చిన కేంద్ర బృందం.. తెలంగాణలో అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో ఆగిపోయిన ప్రాజెక్టులపై చర్చించారు.

హైదరాబాద్, జనవరి 18: కేంద్ర అటవీశాఖ అధికారుల బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ (Union Forest Minister Bhupendra Yadav) ఆదేశాలతో హైదరాబాద్‌కు వచ్చిన డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జితేంద్ర కుమార్ బృందం.. అరణ్య భవన్‌లో రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసి రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు. తెలంగాణలో 161 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నగరానికి వచ్చిన కేంద్ర బృందం.. తెలంగాణలో అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో ఆగిపోయిన ప్రాజెక్టులపై చర్చించారు.
గత గురువారం (జనవరి 16) ఢిల్లీలో కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను రేవంత్ కలిసి చేసిన వినతిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. వెంటనే అటవీ అనుమతుల కారణంగా నిలిచిన ప్రాజెక్టులపై సమీక్ష చేయాలన్న కేంద్రమంత్రి ఆదేశాల మేరకే కేంద్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జితేంద్ర కుమార్ హైదరాబాద్‌కు వచ్చి అరణ్య భవన్‌లో సమీక్ష చేపట్టారు. జితేంద్ర కుమార్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, రూరల్ డెవలమెంట్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Mohan Babu: ట్విస్ట్ ఇచ్చిన మోహన్ బాబు.. మనోజ్ స్పందన ఏంటో
కాగా.. తెలంగాణ అభివృద్ధిలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మార్క్ కనిపిస్తోంది. అభివృద్ధి విషయంలో కేంద్రంతో భేషజాలు ఉండవని పలుమార్లు రేవంత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. గత పదేండ్లు కేంద్రంతో పేచీలు పెట్టుకొని తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ సహకరించలేదని.. ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పెండింగులో ఉన్న ప్రాజెక్టుల విషయంపై కేంద్రంతో మాట్లాడాలని పది రోజుల క్రితం రాష్ట్ర అటవీ శాఖ అధికారులను రేవంత్ ఆదేశించించారు. అవసరమైతే తానే వచ్చి కేంద్రమంత్రితో మాట్లాడుతానని అధికారులకు చెప్పారు. అనుకున్న విధంగానే కేంద్రమంత్రిని సీఎం రేవంత్ కలవడం.. దానికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించడం.. రాష్ట్రానికి కేంద్ర అటవీశాఖ అధికారులు రావడం చకచకా జరిగిపోయాయి. సీఎం చూపిన చొరవ వల్లే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చారని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు
Read Latest Telangana News And Telugu News