Share News

Caste Census Survey: తెలంగాణలో మరోసారి కులగణన సర్వే

ABN , Publish Date - Feb 15 , 2025 | 03:18 PM

Caste Census Survey: తెలంగాణలో మరోసారి కులగణన సర్వేల ప్రారంభంకానుంది. మూడు విధానాలలో వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఛాన్స్ ఇచ్చింది.

Caste Census Survey: తెలంగాణలో మరోసారి కులగణన సర్వే
Caste Census Survey

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో (Telangana) మరోసారి కులగణన సర్వే మొదలుకానుంది. రేపటి (ఆదివారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో సారి కులగణన సర్వే (Caste Census Survey) ప్రారంభంకానున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ (Telangana Govt) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి విడతలో కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సర్వే కొనసాగనుంది. మూడు విధాలుగా వివరాల నమోదుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఎన్యూమరేటర్లను పిలిపించుకునే ఛాన్స్ కూడా ఇచ్చింది.


ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జిల్లాల కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సర్వేపై కీలక సూచనలు చేసి టోల్ ఫ్రీ నంబర్‌ను సీఎస్ ప్రకటించనున్నారు. ఆన్ లై‌న్‌లో ఫామ్స్ డౌన్‌లోడ్ చేసుకుని వివరాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. నేరుగా మండల పరిషత్ కార్యాలయం వెళ్లి వివరాలు సమరించేందుకు అవకాశం ఉంది.


కాగా.. గత ఏడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు మొదటి సారి కులగణన సర్వే నిర్వహించింది ప్రభుత్వం. బీసీ జనాభా లెక్కల కోసం ప్రభుత్వం ఈ కులగణన సర్వేను చేసింది. అందుకు సంబందించిన వివరాలను కూడా సర్కార్ బయటపెట్టింది. ఈ సర్వేలో 3 కోట్ల 54 లక్షల పై చిలుకు మంది తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వం వివరించారు. ఇది రాష్ట్ర జనాభాలో 96.9 శాతంగా నమోదు అయ్యింది. మరొక 3.1శాతం జనాభా కుటుంబ సర్వేలో పాల్గొనలేదని స్పష్టం చేసింది. అందులో ప్రధానంగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు కూడా సర్వేలో వివరాలు నమోదు చేసుకోలేదని వెల్లడించింది. కేసీఆర్‌, కేటీఆర్, హరీష్‌ రావు వంటి నేతలు ఈ సర్వేలు వివరాలు నమోదు చేసుకోలేదు. 3.1 శాతం ప్రజలు వివిధ కారణాలతో ఈ సర్వేలో పాల్గొనలేదు. దీనిపై సమగ్రంగా వివరాలు వచ్చి తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ముందుు వెళ్లాలనే డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కులగణన సర్వే చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రేపటి నుంచి సర్వే ప్రారంభంకానుంది. దాదాపు 12 రోజుల పాటు సర్వేను జరుగనుంది. కులగణన సర్వేలో పాల్గొనని వారు మరోసారి వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఇచ్చింది సర్కార్.


ఇవి కూడా చదవండి..

జైల్లో వల్లభనేని వంశీ చిందులు.. పోలీసులు సీరియస్.. ఏం చేశారంటే..

గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 15 , 2025 | 03:19 PM