Congress Leader VH Rao: జనగణనలో కులగణన చేయాలని గతంలోనే ప్రధానిని కోరా: వీహెచ్
ABN , Publish Date - Dec 13 , 2025 | 08:28 PM
జనగణనలో కులగణన చేయాలనే అంశంపై.. కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడారు. ఈ విషయమై తాను ప్రధాన మంత్రిని గతంలో కలిసినప్పుడే చర్చించినట్టు చెప్పారాయన.
ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత రావు(Congess MP V.Hanumantha Rao) కీలక వ్యాఖ్యలు చేసారు. తాను గతంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi)ని కలిసి జనగణనలో కులగణన(Caste Census) చేయాలని కోరినట్టు ఆయన తెలిపారు. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖనూ ఏర్పాటుచేయాలని అభ్యర్థించినట్టు కూడా హనుమంత రావు చెప్పారు. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi).. పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బీసీల సమస్యలు తెలుసుకున్నారన్నారు.
'జనగణనలో కులాల వారిగా లెక్కలు తెలుస్తామని రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు. బాపూజీ రోజ్ గార్ యోజనను ప్రధాని మోదీ.. మన్‌రేగా(MNREGS) అని పేరు మార్చారు. వెనుకబడిన కులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అప్పుడు ఓబీసీలం ఏమీ మాట్లాడలేదు. జనగణన కోసం ప్రభుత్వం రూ.11,700 కోట్లు కేటాయించింది. జనాభాలో 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఓబీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఓబీసీలలో ఎంతో మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.. వారెందుకు మాట్లాడ్డం లేదు? తెలంగాణ బీజేపీ నేతలు గెలిచి కూడా ఏమీ చేయడంలేదని మోదీ ఇటీవల అన్నారు. 9వ షెడ్యూల్‌లో అయినా ఓబీసీలకు రిజర్వేషన్లు పెంచాలి' అని హనుమంత రావు చెప్పారు.
ఈ విషయమై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) తమను ప్రధానమంత్రి దగ్గరకు తీసుకెళ్తే అంతా కలిసి వస్తామని ఈ సందర్భంగా హనుమంత రావు అన్నారు. బీజేపీ ఎంపీలంతా తమను తీసుకెళ్లాలని, న్యాయం చేయాలని కోరారు. ఇక.. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ కంటే ఇండిపెండెంట్ అభ్యర్థులే ఎక్కువ చోట్ల విజయం సాధిస్తున్నారని కాంగ్రెస్ నేత విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ డిపాజిట్ కోల్పోయిందన్నారు.
ఇవీ చదవండి: