Share News

Maheshwar Reddy: బీఆర్‌ఎస్‌లో చీలిక ఖాయమన్న బీజేపీ నేత

ABN , Publish Date - May 17 , 2025 | 04:49 PM

Maheshwar Reddy: బీఆర్‌ఎస్‌లో కవిత, హరీష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు. కవిత ఒంటరి అయ్యిందని... ఆదిపథ్య పోరు తారా స్థాయికి చేరిందని పేర్కొన్నారు.

Maheshwar Reddy: బీఆర్‌ఎస్‌లో చీలిక ఖాయమన్న బీజేపీ నేత
Maheshwar Reddy

హైదరాబాద్, మే 17: బీఆర్ఎస్‌లో నాలుగు స్తంభాలాట నడుస్తోందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి (BJLP Leader Alleti Maheshwar Reddy) వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావ్ (Former Minister Harish Rao) నేతృత్వంలో బీఆర్‌ఎస్ చీలిక దిశగా అడుగులు వేస్తోందన్నారు. పదిమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతే బీఆర్‌ఎస్ఎల్పీ చీలిపోతుందన్నారు. తండ్రీ, కొడుకు, కూతురు, అల్లుడు మధ్య విబేధాలు ఉన్నాయని తెలిపారు. రజితోత్సవ సభలో కేటీఆర్‌దే పెత్తనమని.. కవిత,హరీష్ రావులకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదని తెలిపారు. హరీష్, కవితలు డమ్మీగా మిగిలారని అన్నారు. వివిధ కారణాలతో కేసీఆర్ (Former CM KCR) క్రియాశీలకంగా ఉండటం లేదని.. సభలో కూడా అంత యాక్టీవ్‌గా లేరన్నారు.


తన తరువాతి బీఆర్ఎస్ చీఫ్ కేటీఆర్ అని పరోక్షంగా ఇండికేషన్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. డీఫాల్ట్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ కొనసాగుతున్నారని.. కేసీఆర్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. సభలో తండ్రీకొడుకులు కీలకంగా వ్యవహరించారని అన్నారు. కవిత, హరీష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు. కవిత ఒంటరి అయ్యిందని... ఆదిపథ్య పోరు తారా స్థాయికి చేరిందని పేర్కొన్నారు. కవిత తీసుకున్న తెలంగాణ తల్లి మార్పు, పూలే విగ్రహం ఏర్పాటుకు పార్టీ నుంచి మద్దతు రాలేదన్నారు. మహిళా సమానత , సామాజిక తెలంగాణ సాధన అంశంలో బీఆర్ఎస్ విఫలమైందన్న వ్యాఖ్యలు వ్యూహాత్మకమే అని వెల్లడించారు. పదవులు, ఆస్తులు అన్నీ కేటీఆర్ కేనా అంటూ లేఖాస్త్రంలో కవిత తిరుగుబాటు చేశారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనపై కవిత విమర్శలు చేస్తున్నారని.. కేసీఆర్‌కు రాసిన లేఖ త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఉద్యమంలో జాగృతి కృషి ఉందని.. వాస్తవాలు బయటపెట్టాలని కవిత అనుకుంటున్నట్లు తెలిపారు. కేటీఆర్‌కే అన్ని ఇస్తుండటంతో కవిత తిరుగుబాటు జెండా ఎగురవేశారన్నారు.


తనను రాజకీయంగా అణిచి వేసేందుకు కేటీఆర్ కుట్ర చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారని వ్యాఖ్యలు చేశారు. మేడే రోజు తండ్రి పాలనా వైఫల్యాలు ఎండగట్టినట్లు చెప్పారు. తనను రెచ్చగొడితే మరింత రెచ్చిపోతానని చెప్పడం ఆమెలోనే ఆవేదన బయటపడిందన్నారు. బీఆర్ఎస్‌లో ఒకే పవర్ సెంటర్ ఉండాలని కేటీఆర్ అభిమతమని తెలిపారు. జగన్, షర్మిల తరహాలోనే కేటీఆర్‌కు కవిత తయారైనట్లు తెలిపారు. సొంత ఎజెండా పెట్టుకుని పని చేయకూడదని కేటీఆర్ చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్‌పై విమర్శలు చేసిన వెంటనే హరీష్ రావు మీడియా సమావేశం వెనక కేసీఆర్ హస్తం ఉందన్నారు.


బీఆర్ఎస్‌ను చీల్చడం రేవంత్ రెడ్డితో కాలేదని.. అందుకే హరీష్‌ను అడ్డం పెట్టుకొని తన పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఫారిన్ టూర్‌లోకి వెళ్లగానే బీఆర్ఎస్‌లో చీలిక రాబోతోందంటూ సంచలన కామెంట్స్ చేవారు. ఈ నెలాఖరులోగా లేదా మొదటి వారంలో చీలిక వస్తుందన్నారు. చీలిక కోసం తెరవెనుక జరగాల్సిన తంతు రేవంత్ రెడ్డి సహకారంతో హరీష్‌ రావు, కవితలు చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్‌లో ఉంటే తమకు ఎదిగే అవకాశం ఉండదని హరీష్, కవితలు ఈ వ్యూహానికి తెరతీశారంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సెన్షేషనల్ కామెంట్స్ చేశారు.


ఇవి కూడా చదవండి

Army Jawan Land Dispute: సరిహద్దుల్లో జవాన్.. ఇక్కడ భూమి కబ్జా..

India vs Pakistan: కశ్మీరే పాక్ ఆయుధం.. ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2025 | 04:49 PM