MP Laxman: ఆ భూములు బడాబాబులకు కట్టబెట్టే యత్నం.. రేవంత్‌పై లక్ష్మణ్ ఫైర్
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:47 PM
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికలు ఖాయమని ఎంపీ లక్ష్మణ్ సంచలన కామెంట్స్ చేశారు. అందులో బీజేపీ గెలుస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, నవంబర్ 22: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పారిశ్రామిక భూములను లాక్కుని పెద్ద కుంభకోణానికి తెరలేపుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఇండస్ట్రీ భూములను బడా బాబులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దాదాపు పదివేల ఎకరాల పారిశ్రామిక భూములను లాక్కుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కాంకు పాల్పడుతున్నారంటూ ఎంపీ ఫైర్ అయ్యారు.
నాడు కేసీఆర్ కూడా ఇందిరా పార్క్, ఎన్టీఆర్ స్టేడియం భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే అడ్డుకున్నామని గుర్తుచేశారు. పారిశ్రామిక భూములను ప్రజా ప్రయోజనాల కోసమే కేటాయించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక భూములను లాక్కునే పాలసీని క్యాబినెట్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఒక బీజేపీ ఎంపీకి అధిష్టానం నోటీసు ఇచ్చిన అంశం తన దృష్టికి రాలేదని చెప్పుకొచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిపై ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించుకుంటామని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికలు ఖాయమన్నారు. అందులో బీజేపీ గెలుస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీకి మంచి రోజులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో పారిశ్రామిక భూములు కాపాడుతామని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఇది మంచి పరిణామం: డిప్యూటీ సీఎం భట్టి
సైబర్ నేరాలపై అవగాహన, అప్రమత్తత ఉండాల్సిందే: సీపీ సజ్జనార్
Read Latest Telangana News And Telugu News