Share News

Betting Apps Controversy: ఎంటరైన ఈడీ.. ఫోన్లు స్విచ్చాఫ్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లు..

ABN , Publish Date - Mar 19 , 2025 | 08:56 AM

హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో వేగం పెంచారు. నిందితులకు ఒక్కొక్కరిగా నోటీసులు ఇస్తూ విచారణకు పిలుస్తున్నారు.

Betting Apps Controversy: ఎంటరైన ఈడీ.. ఫోన్లు స్విచ్చాఫ్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లు..
Betting Apps Controversy

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్(Betting Apps) వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‍గా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూఎన్సర్లు(Social Media influencers), బుల్లి తెర సెలబ్రిటీలపై కేసులు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) చేపట్టిన "సే నో టూ బెట్టింగ్ యాప్స్" నివారణ ఉద్యమం ఫలితానిస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కేసులో ఇరుక్కున్న 11 మంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.


హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తులో వేగం పెంచారు. నిందితులకు ఒక్కొక్కరిగా నోటీసులు ఇస్తూ విచారణకు పిలుస్తున్నారు. ఇప్పటికే విష్ణు ప్రియ, టేస్టీ తేజాకు నోటీసులు అందజేయగా వారిలో నిన్న (మంగళవారం) పోలీసుల ఎదుట టేస్టీ తేజ హాజరయ్యారు. విచారణ సందర్భంగా టేస్టీ తేజా, బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు మధ్య ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. ప్రమోషన్‍లో భాగంగా ఎలాంటి నజరానా పొందాడనే వివరాలను రాబట్టారు. కాగా, బుధవారం మరికొంతమందికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.


తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మరో ఆరుగురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు ఇచ్చారు. వీరిని గురువారం నాడు విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, కేసు నమోదైన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్‌, హర్ష సాయి ఇప్పటికే దుబాయ్‌కి పరారయ్యారు. అయితే పోలీసులు మాత్రం నిందితుల నుంచి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. అలాగే హీరో, హీరోయిన్లతోపాటు మరికొంతమంది ఇన్‌ఫ్ల్యూఎన్సర్లపైనా నిఘా పెంచారు.


మరోవైపు బెట్టింగ్ ప్రమోషన్స్‌లో మనీ ల్యాండరింగ్ జరిగిందనే కోణంలో ఈ కేసులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎంటరైంది. ఈడీ ఎంటర్ అవ్వడంతో బెట్టింగ్ ప్రమోషన్ చేసిన నిందితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అరెస్టు భయంతో కొందరు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న మిగతా వారిపైనా పోలీసులు మరింత నిఘా పెంచారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..

Sunita Williams: రోజుకు 16 సార్లు సూర్యోదయం.. సునీతా విలియమ్స్ అనుభవాలు ఇవే..

Updated Date - Mar 19 , 2025 | 10:11 AM