Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..
ABN , Publish Date - Mar 19 , 2025 | 08:00 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును భారత్‍కు రప్పించేందుకు మార్గం సుగమం అయ్యింది. వారిద్దరిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు (Prabhakar Rao), శ్రవణ్ రావు(Sravan Rao)ను భారత్‍కు రప్పించేందుకు మార్గం సుగమం అయ్యింది. వారిద్దరిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు (Red Corner Notice) జారీ చేసింది. ఈ మేరకు రెడ్ కార్నర్ నోటీసుపై ఇంటర్ పోల్ ద్వారా సీబీఐకు, సీబీఐ నుంచి తెలంగాణ సీఐడీకి సమాచారం అందింది.
వీలైనంత తొందరగా నిందితులను భారత్‌కు రప్పించేందుకు కేంద్ర హోంశాఖతోపాటు, విదేశీ వ్యవహారాల శాఖతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. డీహెచ్ఎస్‌కు సమాచారం అందగానే అమెరికాలో పొవిజనల్ అరెస్ట్(తాత్కాలిక అరెస్ట్ ) చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమెరికా నుంచి నిందితులను డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా ఇండియాకు పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ పంజాగుట్టలో ఫోన్ ట్యాంపింగ్ కేసు నమోదు కాగానే నిందుతులు అమెరికా పారిపోయిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి:
Sunita Williams: రోజుకు 16 సార్లు సూర్యోదయం.. సునీతా విలియమ్స్ అనుభవాలు ఇవే..