R Krishnayya on BC reservations: దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. హైకోర్టు స్టేపై ఆర్.కృష్ణయ్య మండిపాటు..
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:47 PM
ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో స్టే ఇవ్వవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని గుర్తు చేశారు ఆర్.కృష్ణయ్య. సుప్రీంకోర్టుకు విరుద్ధంగా హైకోర్టు స్టే ఇవ్వడం బీసీ ప్రజల నోరు కొట్టడమేనని.. నోటికాడ అన్నం ముద్ద లాక్కోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై హైకోర్టు(High Court) ఇచ్చిన స్టే జీర్ణించుకోలేకపోతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R Krishnayya) అన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవోను, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ చరిత్రలో నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఎప్పుడూ స్టే ఇవ్వలేదు అని చెప్పారు.
నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టుకు విరుద్ధంగా హైకోర్టు స్టే ఇవ్వడం బీసీ ప్రజల నోరు కొట్టడమేనని.. నోటికాడ అన్నం ముద్ద లాక్కోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలంటే ఇంత చిన్నచూపు, నిర్లక్ష్యమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేసుకుంటూ వస్తుందని చెప్పారు. దీని వెనుక ఏదో కథ నడిచినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..