Mastansai Case: మస్తాన్ సాయి కేసు.. ఏకంగా పోలీసులతోనే బేరసారాలు
ABN , Publish Date - Feb 10 , 2025 | 11:40 AM
Mastansai Case: సంచలనం సృష్టిస్తోన్న మస్తాన్ సాయి కేసులో మరో ఆడియో వెలుగులోకి వచ్చింది. మస్తాన్ సాయి, అతడి తండ్రి మాట్లాడుకున్న ఆడియో బయటపడింది. గుంటూరులో మస్తాన్ సాయిపై లావణ్య ఇచ్చిన కేసుపై పోలీసులతో మస్తాన్‌సాయి బేరసారాలు ఆడినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న మస్తాన్ సాయి కేసులో (Mastan Sai Case) రోజుకో రహస్యాలు బయటకు వస్తున్నాయి. యువతులను బ్లాక్ మెయిల్ చేసి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది. నగ్న వీడియోల కేసులో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. అలాగే మస్తాన్ సాయి ఎఫ్‌ఐఆర్‌లో కూడా కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. నగ్న వీడియోలే కాకుండా డ్రగ్స్ పార్టీలు కూడా చేసుకున్నట్లు బయటపడింది. వారాంతరాల్లో మస్తాన్ సాయి ఇంట్లో జరిగే డ్రగ్స్ పార్టీలకు యువతీయువకులు పాల్గొన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో డ్రగ్స్ బయటపడటంతో నార్కోటిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు.
ఇక తాజాగా మస్తాన్ సాయి లావణ్య కేసులో మరో ఆడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మస్తాన్ సాయి, అతడి తండ్రి మాట్లాడిన ఆడియో బయటపడింది. వీరు ఏకంగా పోలీసులతోనే బేరసారాలు ఆడినట్లు ఆడియోలు స్పష్టంగా వినిపిస్తోంది. మస్తాన్ సాయిపై లావణ్య పెట్టిన కేసులో పోలీసులతో బేరసారాలకు దిగారు వీరు. గతంలో ఏపీలోని గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో మస్తాన్ సాయిపై లావణ్య కేసు పెట్టింది. ఈ క్రమంలో ఈ కేసును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పోలీసులతో బేరసారాలు ఆడినట్లు తెలుస్తోంది. ఛార్జ్‌షీట్ వేసే సమయంలో తమకు అనుకూలంగా రాస్తే డబ్బులు ఇస్తామని మస్తాన్ సాయి, అతడి తండ్రి పోలీసులకు తెలిపారు. పోలీసులకు డబ్బులు ఎరవేసి మరీ తనకు అనుకూలంగా కేసును మార్చుకున్నాడు మస్తాన్ సాయి. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మనకు అనుకూలంగా ఛార్జ్‌షీట్ ఉండాలని తండ్రితో మస్తాన్ సాయి మాట్లాడిన ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.
గతంలో మస్తాన్ సాయి సోదరి వద్దకు లావణ్య వెళ్లింది. ఈ క్రమంలో ఆమె వీడియోలు తీశాడు మస్తాన్ సాయి. దీనిపై ప్రశ్నించగా లావణ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు.. అంతేకాకుండా లైంగిక దాడికి కూడా పాల్పడినట్లు అప్పట్లో పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది లావణ్య.ఈ కేసుకు సంబంధించి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కాకుండా తమకు అనుకూలంగా ఛార్జ్‌షీట్ వేసే విధంగా పోలీసులతో మస్తాన్ సాయి, తండ్రి బేరసారాలు ఆడినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా మస్తాన్ సాయికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు నగ్నవీడియోలు, డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈరోజు(సోమవారం) మస్తాన్ సాయిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
Minister Komatireddy: మహాకుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పుణ్యస్నానం
Fire Accident.. పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం..
Read Latest Telangana News And Telugu News