Actor Shivaji: మహిళా కమిషన్ విచారణకు నటుడు శివాజీ.. స్టేట్‌మెంట్ రికార్డ్
ABN , Publish Date - Dec 27 , 2025 | 12:11 PM
మహిళా కమిషన్ ముందు విచారణకు నటుడు శివాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్స్ వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చారు శివాజీ.
హైదరాబాద్, డిసెంబర్ 27: నటుడు శివాజీ (Actor Shivaji) బుద్ధభవన్‌లో మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. హీరోయిన్స్‌ను ఉద్దేశించి శివాజీ చేసిన అభ్యంతర వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ వివరణ ఇవ్వాలని శివాజీకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో విచారణకు హాజరైన శివాజీ.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. శివాజీ స్టేట్‌మెంట్‌ను మహిళా కమిషన్ రికార్డ్ చేసుకుంది. ఇప్పటికే ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా శివాజీ క్షమాపణలు చెప్పారు.
అనుకోకుండా మాటలు దొర్లాయని మహిళా కమిషన్ ముందు శివాజీ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని నటుడు చెప్పినట్లు సమాచారం. కాగా.. ఇటీవల దండోరా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్‌ల వస్త్రధారణను ఉద్దేశించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దానిపై సోషల్ మీడియాలో స్పందించిన శివాజీ.. తాను అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నాను.. క్షమించాలని కోరారు.
అయినప్పటికీ మహిళా కమిషన్ మాత్రం.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందే అంటూ నటుడికి నోటీసులు ఇచ్చింది. దీంతో శివాజీ వ్యక్తిగతంగా విచారణకు హాజరై.. మహిళా కమిషన్‌కు వివరణ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి...
ఆన్‌లైన్ గేమ్స్‌కు మరొకరు బలి...
డ్రగ్స్ కేసు.. తప్పించుకున్న నటి సోదరుడు.. పోలీసుల గాలింపు
Read Latest Telangana News And Telugu News