Share News

Cellphone: అధికంగా సెల్‌ఫోన్‌ వాడకం.. మానసిక సమస్యలతో సతమతం

ABN , Publish Date - Oct 16 , 2025 | 09:43 AM

సెల్‌ఫోన్‌ అధికంగా వాడటం వల్ల తన కుమారుడు మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని ఓ తండ్రి చెప్పాడు. రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌కు చెందిన ఎస్‌. మణిపాల్‌రెడ్డి కుమారుడు ఎస్‌. తరుణ్‌రెడ్డి(23)కి మూడేళ్లుగా మానసిక పరిస్థితి సరిగా లేదు.

Cellphone: అధికంగా సెల్‌ఫోన్‌ వాడకం.. మానసిక సమస్యలతో సతమతం

- చికిత్స కోసం ఎర్రగడ్డ చికిత్సాలయానికి యువకుడు

- అవయవాలు తీసేస్తారన్న భయంతో పరారీ

హైదరాబాద్: సెల్‌ఫోన్‌(Cellphone) అధికంగా వాడటం వల్ల తన కుమారుడు మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని ఓ తండ్రి చెప్పాడు. రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా ఆమన్‌గల్‌కు చెందిన ఎస్‌. మణిపాల్‌రెడ్డి కుమారుడు ఎస్‌. తరుణ్‌రెడ్డి(23)కి మూడేళ్లుగా మానసిక పరిస్థితి సరిగా లేదు. ఏడాదిన్నర పాటు ప్రైవేట్‌ వైద్యుల వద్ద తల్లిదండ్రులు చికిత్స చేయించారు. కొంతకాలం నుంచి ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో వైద్యం చేయిస్తున్నారు. బుధవారం తరుణ్‌రెడ్డి(Tarun Reddy)ని తండ్రి ఆస్పత్రికి తీసుకొచ్చాడు.


city6.2.jpg

తరుణ్‌ను రోగుల లైన్‌లో నిలబెట్టి మందుల కోసం మణిపాల్‌రెడ్డి మరోచోటికి వెళ్లాడు. ఆయన తిరిగి వచ్చేసరికి తరుణ్‌ కనిపించలేదు. తన కుమారుడికి ఆస్పత్రి ఫోబియా ఉందని, అవయవాలు తీసేస్తారని భయపడేవాడన్నారు. మణిపాల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు(Borabanda Police) కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా

వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 16 , 2025 | 09:43 AM