Hyderabad: నగరంలో.. మరో మూడు బస్‌డిపోలు
ABN , Publish Date - Aug 13 , 2025 | 09:34 AM
కొత్త బస్‌డిపోల ఏర్పాటుపై గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా శివారు ప్రాంతాల్లో కొత్తగా మూడు, నాలుగు బస్ డిపోల ఏర్పాటు దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది.
- డిసెంబర్ నాటికి ఏర్పాటు చేసేలా ప్రణాళికలు
- స్థలాలు కేటాయించాలంటూ ఆర్టీసీ ప్రతిపాదనలు
హైదరాబాద్ సిటీ: కొత్త బస్‌డిపోల ఏర్పాటుపై గ్రేటర్ ఆర్టీసీ(Greater RTC) ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా శివారు ప్రాంతాల్లో కొత్తగా మూడు, నాలుగు బస్ డిపోల ఏర్పాటు దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది. డిపోల నిమిత్తం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఆర్టీసీకి స్థలాలు కేటాయించాలంటూ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
గ్రేటర్‌జోన్ పరిధిలో ప్రస్తుతం 25 బస్ డిపోలుండగా 3,043 బస్సులు నడుస్తున్నాయి. ఒక్కో డిపోలో 120 నుంచి 130 వరకు బస్సులు ఉండటం, ఈ ఏడాది చివరి నాటికి మరో 300 పైగా కొత్త బస్సులు వచ్చే అవకాశాలుండటంతో డిసెంబర్ నాటికి కొత్త డిపోలు ఏర్పాటు చేసుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. ఓఆర్‌ఆర్ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తోంది. ట్రాఫిక్ కారణంగా ఉదయం,

రాత్రి సమయంలో ఆర్టీసీ బస్సులు డిపోలకు చేరుకోవాలన్నా గంట నుంచి 2 గంటల సమయం వృథా అవుతోందని, శివార్లలో కొత్త డిపోలు ఏర్పాటుచేస్తే సమయం ఆదాతో పాటు ప్రస్తుతం ఉన్న డిపోలపై బస్సుల ఒత్తిడి తగ్గుతుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలకు ఆర్టీసీ నడిపే ఎలక్ర్టిక్ బస్సులకు రాత్రి సమయాల్లో శివారు డిపోల్లో చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం ఉంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరుగుదొడ్డిలో 16 అడుగుల కింగ్ కోబ్రా
నేడు దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News