Electric buses: డిసెంబరు నాటికి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు
ABN , Publish Date - Oct 24 , 2025 | 06:52 AM
గ్రేటర్‌లో డిసెంబరు నాటికి కొత్తగా వందకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి తీసుకువచ్చే దిశగా టీజీఎ్‌సఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నగరంలో 265 ఎలక్ర్టిక్ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ క్రమంగా వాటి సంఖ్య పెంచుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది.
- ఇప్పటికే రోడ్లపై 265 ఎలక్ర్టిక్ బస్సులు
- మరో 275 తీసుకువచ్చే దిశగా చర్యలు
హైదరాబాద్ సిటీ: గ్రేటర్‌లో డిసెంబరు నాటికి కొత్తగా వందకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు(Electric buses) రోడ్లపైకి తీసుకువచ్చే దిశగా టీజీఎస్ ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నగరంలో 265 ఎలక్ర్టిక్ బస్సులు నడుపుతున్న ఆర్టీసీ క్రమంగా వాటి సంఖ్య పెంచుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. మరో ఆరు నెలల్లో 275 ఈవీ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే గ్రేటర్‌జోన్ పరిధిలోని 25 బస్సు డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలను సిద్ధం చేశారు.

కంటోన్మెంట్, హెచ్‌సీయూ, మియాపూర్-2(Cantonment, HCU, Miyapur-2) డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉండగా.. డిసెంబరు నాటికి మరో 10 డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ప్రధాన రహదారులకు సమీపంలో ఉన్న డిపోల్లో మొదట ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే ఆయా డిపోల్లో జిల్లా సర్వీసులు సైతం చార్జింగ్ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మద్యం దరఖాస్తులతో 2,863 కోట్ల ఆదాయం
విమానాల్లో పవర్ బ్యాంకులపై నిషేధం
Read Latest Telangana News and National News