Share News

Telugu Thalli Flyover: తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పేరు మారుస్తూ నిర్ణయం..

ABN , Publish Date - Sep 24 , 2025 | 09:39 PM

గ్రెటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ పేరును మార్చాలని నిర్ణయించారు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌గా మారుస్తూ స్టాండింగ్ కమిట తీర్మానం చేసింది.

Telugu Thalli Flyover: తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పేరు మారుస్తూ నిర్ణయం..
Telugu Thalli Flyover

హైదరాబాద్, సెప్టెంబర్ 24: గ్రెటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ పేరును మార్చాలని నిర్ణయించారు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌గా మారుస్తూ స్టాండింగ్ కమిట తీర్మానం చేసింది. మరోవైపు ఫ్లై ఓవర్ కోసం ఆర్చ్‌ను చేస్తోంది జీహెచ్ఎంసీ. బ్రిడ్జికి ఇరువైపులా ఆర్చ్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం వద్ద తీవ్రమై ట్రాఫిక్ సమస్య ఉండేది. దీనిని నియంత్రించేందుకు 1997 లో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సచివాలయం నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు నిర్మించిన ఈ బ్రిడ్జ్‌ని 2005లో ప్రారంభించారు. దీనికి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ అని నామకరణం చేశారు. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ను తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌గా మార్చాలని నిర్ణయించారు. ఇదిలాఉంటే.. మేయర్ విజయ లక్ష్మి అధ్యక్షత బుధవారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 14 ఎజెండా అంశాు, 10 టేబుల్ ఐటమ్స్‌కు స్టాండింగ్ కమిటీ ఆమెదం తెలిపింది. ఈ అంశాల్లో తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరు మార్పు కూడా ఉంది.


Also Read:

BJP On Congres CWC Meet: తేజస్వికి ఎక్కువ సీట్లు వదులుకోవడం ఇష్టంలేకే పాట్నాలో సీడబ్ల్యూసీ సమావేశం

Tirumala: శ్రీవారికి 3 కేజీల 860 గ్రా. బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం కానుక

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 24 , 2025 | 09:39 PM