Share News

Hyderabad: ఆ ఏరియాల్లో.. 9 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్..

ABN , Publish Date - Jun 13 , 2025 | 07:20 AM

మరమ్మతుల కారణంగా గ్రీన్‌ ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతోందని ఏడీఈ చరణ్‌ సింగ్‌ తెలిపారు.

Hyderabad: ఆ ఏరియాల్లో.. 9 గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్..
Power Supply

హైదరాబాద్: మరమ్మతుల కారణంగా గ్రీన్‌ ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతోందని ఏడీఈ చరణ్‌ సింగ్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ మున్సిపల్‌ పార్క్‌, హిందూ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ జెక్‌ కాలని, కీర్తిలాల్‌ జువెల్లెర్స్‌, గ్రిన్‌ ల్యాండ్స్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.


అల్లాపూర్‌: అల్లాపూర్‌ డివిజన్‌లోని శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఏ.ఈ.రాకేష్‌ గౌడ్‌ తెలిపారు. రోడ్డు విస్తరణ పనుల కారణంగా స్తంభాల షిఫ్టింగ్‌ జరుగుతున్న దృష్ట్యా, 11 కేవీ మైహోం ఫీడర్‌ ఎమనేటింగ్‌ ఫ్రం అయ్యప్ప సబ్‌స్టేషన్‌ పరిధిలోని సీజీఆర్‌ స్కూల్‌ పరిసరాల నుంచి బిర్యానీ టైమ్స్‌ హోటల్‌ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ ఉండదని రాకేష్‌ తెలిపారు. అదే విధంగా 11 కేవీ సాయినగర్‌ ఫీడర్‌ పరిధిలోని రవీంద్ర సొసైటీ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని అయ్యప్ప సొసైటీ రోడ్‌ నెం.52 నుంచి రోడ్‌ నెం.60, అయ్యప్ప సొసైటీ కార్యాలయం దాకా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదు.


city2.2.jpg

చిక్కడపల్లి: టీజీఎస్‏పీడీసీఎల్‌ హైదరాబాద్‌ సిటీ-1 పరిధిలో శుక్రవారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీఏడీఈ వినోద్‌కుమార్‌ తెలిపారు. కవాడిగూడ 11కేవీ ఫీడర్‌ పరిధిలోని మారియట్‌ హోటల్‌, కవాడిగూడ పెట్రోల్‌పంప్‌ ఎదరువీధి, కొత్తబజార్‌, హనుమాన్‌టెంపుల్‌, సంధ్యబార్‌, పద్మశాలీ కాలనీ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, గోశాల పరిధిలోని లోయర్‌ ట్యాంక్‌బండ్‌, అంబేడ్కర్‌ భవన్‌, రజకకాలనీ, సర్దార్‌జీ పంప్‌హౌస్‌, తాతానగర్‌, సింగాడీబస్తీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ

రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 13 , 2025 | 08:13 AM