Hyderabad: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్
ABN , Publish Date - Nov 29 , 2025 | 06:30 AM
నగరంలో ఆయా ఏరియాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్ల తెలిపారు. వినియోగదాలు సహకరించాలని అధికారులు తెలిపారు.
- నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు
పంజాగుట్ట(హైదరాబాద్): బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ విశ్వభారతి, సాయి ఎన్‌క్లేవ్ ఫీడర్ల పరిధి, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 11 కేవీ కుమ్మరిబస్తీ ఫీడర్ పరిధి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ హైటెక్ థియేటర్, ఉద్యోగ్ నగర్, హైలం కాలనీ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ వంశీకృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ ఎన్‌బీటీ నగర్ ఫీడర్ పరిధి, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ శ్రీముఖి, భారత్ నగర్, బీఎస్ పురి ఫీడర్ల పరిధి, ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11 కేవీ మూసాపేట్ హెచ్‌పీ రోడ్ ఫీడర్ పరిధి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ దుర్గానగర్, నెహ్రూపార్కు ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు ...
చిక్కడపల్లి: ఆజామాబాద్ డివిజన్, హైదరాబాద్ సిటీ-1 పరిధిలో శనివారం విద్యుత్ స రఫరా ఉండదని సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి.వినోద్‌కుమార్ తెలిపారు. కూచిపూడి 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, సాయిబా బా టెంపుల్, సీఈ కాలనీ పరిధిలో ఉదయం 10నుంచి 2గంటల వరకు, బ్రాహ్మణ హాస్టల్, దయారామార్కెట్ పరిధిలో ఉదయం 11గం టల నుంచి 12వరకు, గోల్కొండక్రా్‌సరోడ్ పరిధిలో మధ్యాహ్నం 12నుంచి 1గంటల వరకు, సంజీవయ్యనగర్ పరిధిలో 2.30నుంచి 3గం టల వరకు, ప్లేగ్రౌండ్ పరిధిలో 3నుంచి 5గం టల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

రాయదుర్గం: ఓల్డ్ గచ్చిబౌలి 11 కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇందిరానగర్, ఓల్డ్‌గచ్చిబౌలి, సెంట్రల్‌మాల్‌లో విద్యుత్ ఉండదని అధికారులు వెల్లడించారు. ట్రిపుల్‌ఐటీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జేవీ కాలనీ, పద్మశ్రీ గార్డెన్, ఐఎల్‌ఎస్ పార్కు ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News