Hyderabad: ఆ ఏరియాల్లో 11 గంటల నుంచి కరెంట్ కట్..
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:07 AM
నగరంలోని ఆయా ఏరియాల్లో ఉదయం 11గంటల నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే.. కొన్ని ఏరియాల్లో ఉదయం 10 గంటల నుంచి విద్యుతఫ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
- నగరంలో.. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
పంజాగుట్ట(హైదరాబాద్): గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ అల్లావుద్దీన్ కోఠి ఫీడర్ పరిధి, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ బేగంపేట ప్రభుత్వ ఆస్పత్రి(Begumpet Government Hospital), పీఆర్ నగర్ ఫీడర్ పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు 11 కేవీ బీఎస్ మక్తా, ప్రేమ్ నగర్ ఫీడర్ల పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ సుందర్ నగర్, పెద్దమ్మ నగర్ ఫీడర్ల పరిధి, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
సంతోష్ నగర్: టీఎస్ ఎస్పీపీడీసీఎల్ సరూర్‌నగర్ డివిజన్.. 33/11కేవీ ఫీడర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలలో నిర్వహణ పనుల కారణంగా శనివారం విద్యుత్‌సరఫరా నిలిపి వేస్తున్నామని డీఈ తెలిపారు. 11కేవీ ఆదర్ష్‌నగర్, భవ్యహాస్పిటల్, మమతనగర్, న్యూనాగోల్, సమతపురి, వెంకటరమణకాలనీ, లక్ష్మారెడ్డిపాలెం ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 11కేవీ ఆలిండియా రేడియో ఫీడర్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, 11కేవీ చాణక్యపురి, జీఎస్ ఐ, హనుమాన్‌నగర్, రాక్‌టౌన్, వంబేకాలనీ ఫీడర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్‌సరఫరాలో కలుగుతోందని, వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
మల్కాజిగిరి: వసంతపురి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ సాయిరాం ఫీడర్ లైన్‌పై విద్యుత్ మరమ్మతుల కారణంగా శనివారం ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సత్యనారాయణ కేఫ్, బృందావన్ కాలనీ, ప్రభుత్వ ఆస్పత్రి, గీతనగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నామని వినియోగదారులు సహకరించాలని ఏఈ గోపాల్ తెలిపారు.

ఏఎస్‌రావునగర్‌లో..
ఏఎస్‌రావునగర్: జీకేనగర్, బీఎ్‌సఎన్‌ఎల్, గుడ్‌లక్ హోటల్ ఫీడర్‌లలో సాంకేతిక మరమ్మతుల కారణంగా శనివారం ఆ ఫీడర్ల పరిధిలోని కాలనీలలో విద్యుత్ కోత విధిస్తున్నట్లు ఏఎ్‌సరావునగర్ ఏఈ వేముల గంగాభవాని తెలిపారు. గోకుల్‌నగర్, పార్వతీనగర్, హెచ్‌ఐజి-ఏ, ఆఫీసర్స్ కాలనీ-జి బ్లాక్, శారదా హాస్పిటల్, వాటర్ వర్క్స్ ఆఫీస్, అంకురా ఆస్పత్రి ఏరియాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, కమలానగర్, చైతన్య కాలేజీ, బీఎ్‌సఎన్‌ఎల్ ఆఫీస్ ఏరియా, సత్తిరెడ్డి గల్లి, మహే్‌షనగర్ ప్రభుత్వ పాఠశాల ప్రాంతం, అయ్యప్ప స్వామి టెంపుల్, సౌత్ కమలానగర్ ప్రాంతాలలో ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు, రాధికా చౌరస్తా నుంచి గుడ్‌లక్ కేఫ్ మేయిన్ రోడ్, ఎల్‌ఐజి-ఏ ప్రాంతాలలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో కోత ఉంటుందని, వినియోగదారులు విషయాన్ని గమనించి తమతో సహకరించాలని ఆమె పేర్కొన్నారు.
సైనిక్‌పురి సబ్‌స్టేషన్ పరిధిలో..
కుషాయిగూడ: సాంకేతిక మరమ్మతుల కారణంగా శనివారం సైనిక్‌పురి సబ్‌స్టేషన్ పరిధిలోని ఓయూటీ కాలనీ, సాయిబాబ ఆఫీసర్స్ కాలనీ, భాస్కర్‌రావునగర్, ఈశ్వరిపురి, హెచ్‌ఎంటీ కాలనీ, మానిక్‌సాయి ఎన్‌క్లేవ్, మాధవపురి తదితర ప్రాంతాల్లో ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నట్లు ఏఈ సత్యనారాయణ తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమతో సహకరించాలని ఆయన కోరారు.
ఉప్పల్ ప్రాంతాల్లో..
ఉప్పల్: నూతన సర్వీసుల విడుదల, నిర్వహణ పనుల కారణంగా శనివారం నగరంలోని ఉప్పల్, బొడుప్పల్, ఇంద్రానగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈలు బి.కిరణ్ కుమార్‌రెడ్డి, ఎన్.వేణుగోపాల్ తెలిపారు. ఉప్పల్‌లో ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ఆర్‌టీఏ ఫీడర్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, సరస్వతీ కాలనీ, సూర్యనగర్, వెంకటేశ్వర కాలనీ, ఉప్పల్ మెట్రోస్టేషన్ లేన్, రాజ్యలక్ష్మీ థియేటర్ లేన్, సర్వే క్వార్టర్స్, కేవీ స్కూల్-1 పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు. మధ్యాహ్నం 12.00 నుంచి 12.30 గంటల వరకు ఉప్పల్ భగాయత్ ఫీడర్ పరిధిలోని ఉప్పల్ భగాయత్, ఆరెంజ్ ఆప్తా అపార్ట్‌మెంట్ లేన్ తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిపివేయనున్నారు.
బోడుప్పల్, ఇంద్రానగర్ ప్రాంతాల్లో..
బొడుప్పల్ సబ్‌స్టేషన్ పరిధిలోని ఈస్ట్, వెస్ట్ బృందావన్ కాలనీ, శ్రీనివాస కాలనీ, సతిరెడ్డి కాలనీల్లో ఉదయం 11.30 నుంచి 12.00 గంటల వరకు 33/11 కేవీ విద్యుత్ సరఫరా ఉండదు. ఇంద్రానగర్ సబ్ స్టేషన్ పరిధిలోని బొల్లిగూడెము, అంజయ్య ఎన్‌క్లేవ్, అమ్మసాని వెంకటరెడ్డి నగర్, ఎస్‌బీఆర్ కాలనీ, టెలిఫోన్ కాలనీ, రాజలింగము కాలనీ (ఫేజ్-1, 2), సురాజు నగర్, మహాలక్ష్మి నగర్, బాలాజీ నగర్, లక్ష్మారెడ్డి నగర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.00 నుంచి 3.30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు వెల్లడించారు.
పేట్‌బషీరాబాద్: కొంపల్లి సబ్-స్టేషన్ పరిధిలో చెట్లకొమ్మల తొలగింపు పనుల కారణంగా శనివారం ఈ కింది ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. దూలపల్లి, ఐడీఏ ఫేజ్-1,2, అపర్ణ గార్డెన్ సొసైటీ తదితర ప్రాంతాల్లోని కాలనీల్లో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, మఽధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమ సిబ్బందికి సహకరించాలని ఏఈ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!
బ్యాంకింగ్ వదిలి చాక్లెట్ మేకింగ్
Read Latest Telangana News and National News