Share News

Electricity: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Nov 22 , 2025 | 06:49 AM

గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ వంశీకృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు 11కేవీ బోరబండ ఎస్‌ఆర్టీనగర్‌ ఫీడర్‌ పరిధి విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. ఆ ఏరియా వాసులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Electricity: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి కరెంట్ కట్

  • నగరంలో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

పంజాగుట్ట(హైదరాబాద్: గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ(Greenland ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ వంశీకృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు 11కేవీ బోరబండ ఎస్‌ఆర్టీనగర్‌ ఫీడర్‌ పరిధి, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ ప్రకాష్ నగర్‌ ఎక్స్‌టెన్షన్‌, బోరబండ రామారావునగర్‌ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ బేగంపేట శాంతిబాగ్‌, ఎర్రగడ్డ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.


నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు..

అల్లాపూర్‌: అల్లాపూర్‌ డివిజన్‌(Allapur Division)లోని పలు కాలనీల్లో కొత్త విద్యుత్‌ తీగలు వేస్తున్నందున శనివారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఏఈ రాకేష గౌడ్‌ తెలిపారు. పర్వత్‌నగర్‌ 11 కేవీ ఫీడర్‌ పరిధిలోని పర్వతనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రి, పాఠశాల, జనప్రియనగర్‌, పర్వత్‌నగర్‌ కమ్యూనిటీహాల్‌ ప్రాంతాల్లో ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 2 గంట ల వరకు విద్యుత్‌ అంతరాయం ఉంటుందని తెలిపారు. 11కేవీ హ్యుం డాయ్‌ ఓహెచ్‌ ఫీడర్‌ పరిధిలోని ఖైతలాపూర్‌ ఫ్లై-ఓవర్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ కాలనీ, ఆర్‌ఆర్‌ఆర్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌, చందా నాయక్‌ తండా ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 వరకు విద్యుత్‌ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.


నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు..

చిక్కడపల్లి: ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. స్పెన్సర్‌ 11కేవీ విద్యుత్‌ ఫీడర్‌ పరిధిలో ఉదయం 10నుంచి మధ్యాహ్నం 1 వరకు, మూన్‌ కేఫ్‌ పరిధిలో 11నుంచి 11.30 గోల్కొండ క్రాస్‌రోడ్‌ పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా ఉండదన్నారు.

నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు..

రామంతాపూర్‌: రామంతాపూర్‌ పాలిటెక్నిక్‌ ఇండోర్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని విశాల్‌ మార్ట్‌ ఫీడర్‌లోని విశాల్‌ బిల్డింగ్‌, గణే్‌షనగర్‌, అరోరా కళాశాల, గుప్తా గార్డెన్‌, బ్రహ్మం గారి ఆలయం, సాయి గార్డెన్స్‌, దూరదర్శన్‌ క్వార్టర్స్‌ ప్రాంతాలలో ఈ నెల 22న శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈ కూతాడి లావణ్య తెలిపారు.


city1.2.jpg

చర్లపల్లి సబ్‌ స్టేషన్‌ పరిధిలో..

కుషాయిగూడ: విద్యుత్‌ లైన్ల మార్పులు, ఇతర మరమ్మతుల కారణంగా వివిధ ఫీడర్ల పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు చర్లపల్లి సబ్‌-స్టేషన్‌ ఏఈ ఏ.బాబురావు తెలిపారు. భరత్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఫీడర్‌ పరిధిలోని ఈసీనగర్‌, మింట్‌ కాలనీ, రైల్వే స్టేషన్‌, మహాలక్ష్మి నగర్‌, రైల్‌ విహార్‌ కాలనీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని వెల్లడించారు.


వాసవీ శివనగర్‌ ఫీడర్‌ పరిధిలో...

వాసవీ శివనగర్‌, శివసాయి నగర్‌, వైష్ణవి ఎన్‌క్లేవ్‌, సోనియాగాంధీ నగర్‌, గణేష్‌ నగర్‌, మారుతి ఎన్‌క్లేవ్‌, సామ్రాట్‌ నగర్‌, శుభోదయ కాలనీ, లక్ష్మీనరసింహ కాలనీ, నాగార్జున నగర్‌ పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తామని చర్లపల్లి సబ్‌స్టేషన్‌-2 ఏఈ బాలరాజు తెలిపారు.

గాంధీనగర్‌ ఫీడర్‌ పరిధిలో...

ఏ.ఎస్.రావు నగర్‌: శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గాంధీ నగర్‌, ఈస్ట్‌ ప్రగతి నగర్‌, ఎస్‌.పి.నగర్‌, చందాబాగ్‌, అంబా నగర్‌, గాయత్రీ నగర్‌, ఎం.జె.కాలనీ, హిల్‌వ్యూ అపార్ట్‌మెంట్స్‌, బాంబే హైట్స్‌ అపార్ట్‌మెంట్స్‌ పరిసర ప్రాంతాలలో కరెంటు సరఫరా ఉండదని ఏ.ఎ్‌స.రావు నగర్‌ సబ్‌స్టేషన్‌ ఏఈ గంగా భవాని తెలిపారు.


నేడు విద్యుత్‌ సరఫరా ఉండని ప్రాంతాలు..

గాజులరామారం: గాజులరామారం విద్యుత్‌ సబ్‌-స్టేషన్‌ పరిధిలో 11 కేవీ ఫీడర్‌ పరిధిలో కరెంట్‌ తీగల మరమ్మతు పనుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కింది ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తామని ఏఈ చైతన్య భార్గవ్‌ తెలిపారు. చంద్రగిరినగర్‌ చౌరస్తా, దర్గా లేన్‌, పీపీ నగర్‌ మసీద్‌ లేన్‌, భవానీనగర్‌, చిత్తారమ్మ దేవినగర్‌, భారత్‌ ఫంక్షన్‌ హాల్‌ లేన్‌ మల్లారెడ్డినగర్‌ ఫేజ్‌-2, చంద్రగిరినగర్‌ బాలాజీస్కూల్‌ లేన్‌ జయశంకర్‌నగర్‌ల్లో విద్యుత్‌ ఉండదని ఏఈ పేర్కొన్నారు.


మియాపూర్‌: చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా మదీనాగూడ 11 కేవీ ఫీడర్‌ పరిఽధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్‌ శాఖ అధికారులు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రశాంత్‌నగర్‌, స్టాలిన్‌నగర్‌, న్యూ ప్రశాంత్‌నగర్‌, రాఘవేంద్ర మిర్రా అపార్ట్‌మెంట్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సోషల్‌ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు

రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 22 , 2025 | 06:54 AM