Share News

Hyderabad: ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి వరకు వ్యాపారాలు వద్దు..

ABN , Publish Date - Jun 26 , 2025 | 10:52 AM

ట్యాంక్‌బండ్‌పై వ్యాపారాలు చేస్తున్న స్ర్టీట్‌ వెండర్స్‌, చిరువ్యాపారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని గాంధీనగర్‌ సబ్‌ డివిజన్‌ ఏసీపీ ఎ.యాదగిరి హెచ్చరించారు.

Hyderabad: ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి వరకు వ్యాపారాలు వద్దు..

-12 దాటితే గొడవల బాధ్యత స్ట్రీట్‌ వెండర్స్‌దే

- గాంధీనగర్‌ ఏసీపీ యాదగిరి

హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై వ్యాపారాలు చేస్తున్న స్ర్టీట్‌ వెండర్స్‌, చిరువ్యాపారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని గాంధీనగర్‌ సబ్‌ డివిజన్‌ ఏసీపీ ఎ.యాదగిరి(ACP M Yadagiri) హెచ్చరించారు. రాత్రి సమయంలో 12గంటల కంటే ముందు తమ షాపులను మూసివేయాలని లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


బుధవారం సాయంత్రం దోమలగూడ పీఎస్‌ పరిధిలోని లోయర్‌ట్యాంక్‌బండ్‌ జగదీష్‌ మందిర్‌లో ట్యాంక్‌బండ్‌ స్ర్టీట్‌ వెండర్స్‌ అండ్‌ హాకర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏసీపీ యాదగిరి, ట్యాంక్‌బండ్‌ స్ర్టీట్‌ వెండర్స్‌ అండ్‌ హాకర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఎం. రమేష్‏రాం, బీఎంఎస్‌ నాయకులు శంకర్‌ హాజరయ్యారు.


city8.jpg

ఈ సందర్భంగా ఏసీపీ యాదగిరి మాట్లాడుతూ... ట్యాంక్‌బండ్‌పై లావాదేవీలు జరిపే స్ర్టీట్‌ వెండర్స్‌ తప్పనిసరిగా నియమనిబంధనలు పాటించాలన్నారు. ట్యాంక్‌బండ్‌పై ఎలాంటి గొడవలు జరిగినా స్ర్టీట్‌ వెండర్సే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ట్యాంక్‌బండ్‌పై దాదాపు 95మంది జీవనాధారం కోసం పనిచేస్తున్నారని, కానీ రాత్రి 12గంటల తరువాత ఎలాంటి గొడవలు, ఇబ్బందులు వచ్చినా వారిపై చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు.


వీధివ్యాపారులు జాగ్రత్తగా ఉండి నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో దోమలగూడ సీఐ శ్రీనివా్‌సరెడ్డి, ఎస్సై శ్రీనివా్‌సరెడ్డి, ట్యాంక్‌బండ్‌ స్ర్టీట్‌ వెండర్స్‌ అండ్‌ హాకర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు మల్లంపేట రమే్‌షరాం, బీఎంఎస్‌ నాయకులు శంకర్‌, కార్యకర్తలు విశ్వనాథ్‌, నాగరాజు, రమేష్‌, యాకన్న తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

వావ్.. మళ్లీ తగ్గిన తగ్గిన బంగారం, వెండి ధరలు

ఆరోగ్యశ్రీ మాటున మోసం చేస్తే కఠిన చర్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 26 , 2025 | 10:52 AM