Police firing incident: చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై డీజీపీ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:12 PM
చాదర్‌ఘాట్‌లో పోలీసులపై మొబైల్ స్నాచర్లు కత్తితో దాడికి యత్నం చేశారని డీజీపీ తెలిపారు. సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడే వారిని పట్టుకునే క్రమంలో నిందితులు కత్తితో దాడి చేశారని.. డీసీపీ చైతన్య కుమార్, గన్ మెన్ మూర్తి 750 మీటర్లు వెంబడించి నిందితులను చేజ్ చేశారని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 26: హైదరాబాద్ నడిబొడ్డున తుపాకీ కాల్పుల ఘటనపై డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) కీలక విషయాలు వెల్లడించారు. శనివారం చాదర్‌ఘాట్‌లో పోలీసులపై మొబైల్ స్నాచర్లు కత్తితో దాడికి యత్నం చేశారని తెలిపారు. సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడే వారిని పట్టుకునే క్రమంలో నిందితులు కత్తితో దాడి చేశారని.. డీసీపీ చైతన్య కుమార్, గన్ మెన్ మూర్తి 750 మీటర్లు వెంబడించి నిందితులను చేజ్ చేశారని తెలిపారు. అందులో భాగంగా నిందితులు కత్తితో దాడి చేశారని చెప్పారు. నిందితుడు సయ్యద్ ఒమర్ అన్సారీపై 22 కేసులు ఉన్నాయని స్పష్టం చేశారు. కలపథర్ పరిధిలో ఒమర్ అన్సారీపై రౌడీ షీట్ ఉందని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ధైర్యసాహసాలు కనబరిచిన డీసీపీ, గన్‌మెన్ ఆర్యోగ్య పరిస్థితిని తాను తెలుసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఇద్దరు అధికారులు రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. నిందితుడు ఒమర్ అన్సారీ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగిందని.. ఇతని ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పారు.
డీసీపీ సౌత్ జోన్ నేతృత్వంలో ఈ కేసుతో సంబంధం ఉన్న ఆటో డ్రైవర్, మరొక వ్యక్తిని పట్టుకోవడానికి పోలీస్ బృందాలు పని చేస్తున్నాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కొన్ని ఆధారాలు కూడా లభించాయన్నారు. ఇటీవల ఒమర్ కదలికలు, అతనికి ఉన్న పరిచాయలపై ఆరా తిస్తున్నామని.. విజబుల్ పోలీసింగ్ కూడా పెంచామని వివరించారు. నగర ప్రజలెవ్వరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని.. పోలీసులు ఎప్పుడూ రక్షణగా ఉంటారని ధైర్యం చెప్పారు. రౌడీ షీటర్ లు, దొంగల పట్ల ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. మొబైల్ స్నాచింగ్ గ్యాంగ్స్ పై కూడా నిఘా పటిష్టం చేశామని సజ్జనార్ అన్నారు. డీసీపీ చైతన్య కుమార్ కు మెడ భాగంలో గాయాలు ఉన్నాయిని.. గన్ మెన్ మూర్తికి కాలికి గాయం అయిందని చెప్పారు. డ్రైవర్ సందీప్ అప్రమత్తంగా ఉండి కీలక పాత్ర పోషించారని అభినందించారు. డీసీపీ చైతన్య, మూర్తి, డ్రైవర్ సందీప్ ముగ్గురు ధైర్యసాహసాలు చూపారని కొనియాడారు. ఐదు పోలీసు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.
ఈ కాల్పుల ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) డిమాండ్ చేసింది. ఆసుపత్రిలో అన్సారీని AIMIM బహదూర్‌పురా మొహమ్మద్ ముబీన్ పరామర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్వతంత్ర విచారణ నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాలని అన్నారు. ఏం జరిగిందో దానిపై దర్యాప్తు చేయాలని.. నిజమైన వాస్తవాలను బయటకు తీసుకురావడానికి స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
Dogs attack on Child: చిన్నారిపై కుక్కల దాడి.. సీసీటీవీలో రికార్డ్
Mahesh Goud: మెట్రోఫేస్-2ని అడ్డుకుంటుంది కిషన్‌రెడ్డినే.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్