Dogs attack on Child: చిన్నారిపై కుక్కల దాడి.. సీసీటీవీలో రికార్డ్
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:22 PM
వరంగల్ న్యూషాయంపేటలో విషాద ఘటన జరిగింది. ఒంటరిగా రోడ్డుమీదకు వచ్చిన చిన్నారిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఒక్క క్షణంలో కుక్కలన్నీ చిన్నారిపై పడి దాడి చేశాయి.
వరంగల్, అక్టోబర్ 26: వీధికుక్కలు దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఈ దాడులు జరుగుతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరినీ వీధి కుక్కలు విడిచిపెట్టడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు కుక్కలన్నీ ఒక్కటై ఎగబడి పీక్కుతింటున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకున్నా.. ఈ దాడులు మాత్రం ఆగటం లేవు. గ్రామ సింహాల దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
వరంగల్ న్యూషాయంపేటలో విషాద ఘటన జరిగింది. ఒంటరిగా రోడ్డుమీదకు వచ్చిన చిన్నారిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఒక్క క్షణంలో కుక్కలన్నీ చిన్నారిపై పడి దాడి చేశాయి. ఒక కారు పక్కన సీసీ రోడ్డుపై చిన్నారి వేగంగా నడుస్తూ వెళ్తోంది. ఒక్కసారిగా తడబడి కిందపోయింది. పక్కనే పడుకొని ఉన్న ఒక కుక్క ఆ చిన్నారిపై దాడి చేసింది. వెంటనే అక్కడ ఉన్న కుక్కలన్నీ ఒక్కసారిగా అటాక్ చేశాయి. చిన్నారిని కింద పడేసి కొంత దూరం లాక్కెళ్లాయి. ఈ ఘటనను చూసిన ఒక వ్యక్తి, వెంటనే అప్రమత్తమై కుక్కలను తరిమి చిన్నారిని కాపాడాడు. చిన్నారిని తన కుటుంబ సభ్యులకు అప్పజెప్పాడు. గాయాలైన చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒంటరిగా ఉన్న చిన్నారులు, వృద్ధులపై కుక్కలు దాడి చేయడంపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి: కేటీఆర్