KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి: కేటీఆర్
ABN , Publish Date - Oct 26 , 2025 | 03:38 PM
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ హమాలీ బస్తీలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి పండుగకు కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 26: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ హమాలీ బస్తీలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి పండుగకు కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ఎవరికి అపద వచ్చినా అండగా ఉండే నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని చెప్పారు. రెండు సంవత్సరాల నుండి మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తమకు తెలుసు అని అన్నారు. ఇబ్బందులు పోవాలంటే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని చెప్పారు. మనకు మంచి రోజులు రావాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక జరుగుతుందని.. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఇక్కడ ఉపఎన్నిక జరుగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గెలుపు కోసం పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య, మాగంటి సునీత బరిలో నిలిచారు. ఇక బీజేపీ పార్టీ తరఫున లంకల దీపక్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
ఇవి కూడా చదవండి:
Harish Rao: కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా: హరీశ్ రావు
Kavitha Fires BRS: బీఆర్ఎస్ ఏకపక్షంగా నన్ను బయటకు పంపింది.. కవిత ఎమోషనల్