Share News

Moosi River: మూసీ వెంట ట్రంకులైన్లు..

ABN , Publish Date - Sep 26 , 2025 | 07:48 AM

మూసీనదిలో చుక్క మురుగునీరు కూడా చేరకుండా ట్రంక్‌లైన్లను నిర్మించేందుకు వాటర్‌బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మురుగు పూర్తిగా ట్రంక్‌లైన్లలో చేరేలా చర్యలు చేపడుతూ, వీటిని ఎస్టీపీలకు మళ్లించేలా చర్యలు తీసుకోనుంది.

Moosi River: మూసీ వెంట ట్రంకులైన్లు..

- రూ.4,700కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు

హైదరాబాద్‌ సిటీ: మూసీనది(Moosi River)లో చుక్క మురుగునీరు కూడా చేరకుండా ట్రంక్‌లైన్లను(Trunklines) నిర్మించేందుకు వాటర్‌బోర్డు(Waterboard) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మురుగు పూర్తిగా ట్రంక్‌లైన్లలో చేరేలా చర్యలు చేపడుతూ, వీటిని ఎస్టీపీలకు మళ్లించేలా చర్యలు తీసుకోనుంది. దీంతో మూసీనదిలో మురుగునీరు చుక్క కూడా కలవదని, స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీనదిలో ప్రవహింపజేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.


అందులో భాగంగా పశ్చిమాన ఔటర్‌ రింగ్‌రోడ్డు (నార్సింగి) నుంచి తూర్పున ఔటర్‌ రింగ్‌రోడ్డు (గౌరెల్లి)వరకు మూసీనది వెంట ట్రంక్‌లైన్ల నిర్మాణానికి రూ.4,700కోట్ల అంచనా వ్యయంతో చేసిన ప్రతిపాదనలను వాటర్‌బోర్డు ఇటీవల ప్రభుత్వానికి అందజేసింది. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఆమోదముద్ర వేయగానే టెండర్‌ ప్రక్రియను చేపట్టనున్నారు.

city3.2.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, కానీ వెండి రేట్లు మాత్రం..

కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్

Read Latest Telangana News and National News

Updated Date - Sep 26 , 2025 | 07:48 AM